కల్తీ కొకైన్ తీసుకుని 17 మంది మృతి.. 52 మందికి అస్వస్థత
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో కల్తీ కొకైన్ (Cocaine) తీసుకుని 17 మంది మరణించారు. మరో 52 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్‌లోని ఎనిమిది పట్టణాల్లో విష పదార్థాలు కలిసిన కొకైన్‌ను తీసుకోవడంతో ఇప్పటివరకు 17 మంది రణించారని అధికారులు తెలిపారు. దవాఖానల్లో చేరినవారి పరిస్థితి విషమంగా ఉందని, దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. డ్రగ్స్ ముఠాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే మాదకద్రవ్యాలను కల్తీ చేసినట్లు భావిస్తున్నారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. మరింత ప్రాణనష్టం జరగకుండా పలు ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, కొకైన్ తీసుకున్నవారి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించామని, ల్యాబ్ నివేదికల కోసం చూస్తున్నామని ప్రావిన్షియల్ సెక్యూరిటీ మినిస్టర్ సెర్జియో బెర్నీ తెలిపారు. అదేవిధంగా పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.
కల్తీ కొకైన్ తీసుకోవడంతో హర్లింగ్‌హామ్, శాన్ మార్టిన్, ట్రెస్ డి ఫెబ్రెరో పట్టణాల్లోనే ఎక్కువ మరణాలు సంభవించాయని వెల్లడించారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

