షాకింగ్.. ఫ్రీ లంచ్ కోసం పేర్లు మార్చుకున్న 150 మంది

తైపీ: ఏదైనా ఫ్రీగా వస్తుందంటే ఏం చేయడానికైనా కొంతమంది సిద్ధంగా ఉంటారు. అందులోనూ నోరూరించే లంచ్‌ను ఫ్రీగా ఇస్తామంటే ఊరుకుంటారా? ఏకంగా తమ పేరు మార్చుకోవడానికి కూడా సిద్ధమైపోయారు. తైవాన్‌లోని అకిండో సుషిరో అనే జపనీస్ రెస్టారెంట్ ప్రమోషన్ కోసం చేసిన ఈ పని ఇప్పుడా దేశంలో సంచలనం సృష్టిస్తోంది.
ఎంతోమంది సాల్మన్లు..
జపాన్‌కు చెందిన సుషి అనే వంటకానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలుసు కదా. సాల్మన్ అనే చేపతో చేసే ఈ నోరూరించే వంటకం ఫ్రీగా కావాలంటే మీ పేర్లను సాల్మన్గా మార్చుకోండి అని ఆ రెస్టారెంట్ ప్రచారం మొదలుపెట్టింది. ఇంకేం.. సుషి అంటే పడి చచ్చే 150 మంది ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర క్యూ కట్టారు. తమ పేర్లను అధికారికంగా సాల్మన్గా మార్చుకోవడానికి వాళ్లు సిద్ధపడిపోయారు. కువో అనే ఓ స్టూడెంట్ తన పేరును కువో సాల్మన్ రైస్ బౌల్‌గా మార్చుకుంది. మరో యూనివర్సిటీ విద్యార్థి తన పేరును చౌ షిషెన్గా మార్చుకున్నాడు. ఇలా పేర్లు మార్చుకునే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో దరఖాస్తు చేసుకున్న తర్వాత రెండు వారాలు లేదా నెల రోజుల సమయం ఇవ్వాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆ నెల రోజుల సమయంలో పేరు మార్చుకునేవాళ్ల మనసు మారుతుందన్నది ప్రభుత్వ ఆలోచన.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Japan
- Salmon Fish
- Sushi
- Taipie
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

