సమాచార మార్పిడితో సైబర్ నేరాలకు చెక్
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న సైబర్ నేర ముఠాల ఆట కట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఏకతాటిపైకి వచ్చాయి. రాష్ట్రాల సరిహద్దులు దాటి పనిచేస్తున్న సైబర్ నేరగాళ్ల నెట్వర్లను ఛేదించేందుకు 13 రాష్ట్రాల పోలీస్ అధికారులు,
- ఏకతాటిపైకి 13 రాష్ట్రాలు, 11 కేంద్ర సంస్థలు
- నేరగాళ్ల నెట్వర్పై ఉకుపాదం మోపాలి
- జేసీసీటీ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న సైబర్ నేర ముఠాల ఆట కట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఏకతాటిపైకి వచ్చాయి. రాష్ట్రాల సరిహద్దులు దాటి పనిచేస్తున్న సైబర్ నేరగాళ్ల నెట్వర్లను ఛేదించేందుకు 13 రాష్ట్రాల పోలీస్ అధికారులు, 11 కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు హైదరాబాద్ వేదికగా జరిగిన జేసీసీటీ సమావేశంలో వ్యూహరచన చేశారు. సైబర్ నేరాలను కేసుల వారీ దర్యాప్తు విధానానికి స్వస్తి పలికి రియల్‌టైమ్ సమాచార మార్పిడి, ఉమ్మడి ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ ఆధారిత దర్యాప్తునకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. సైబర్ నేరం ఇప్పుడు ఒక వ్యవస్థీకృత పరిశ్రమగా మారిందని పేరొన్నారు. నేరం జరిగిన తర్వాత డబ్బును రికవరీ చేయడం కంటే నేరమే జరుగకుండా అడ్డుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. సైబర్ నేరగాళ్ల ఖాతాలను బ్లాక్ చేయడం, సామ్ కేంద్రాలను ధ్వంసం చేయడం లాంటి చర్యలు చేపడుతున్నప్పటికీ.. అసలైన సూత్రధారులు, వారికి ఆర్థిక సహకారం అందిస్తున్న వ్యక్తులు మాత్రం దర్యాప్తు సంస్థలకు చికడం లేదని టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

