పరీక్ష రాయకుండానే అక్కడ 10, 11 విద్యార్థులు పాస్

చెన్నై: పుదుచ్చేరి, కరైకాల్ రీజియన్లలో తమిళనాడు బోర్డుకు అనుబంధంగా నడుస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో 10, 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాయకుండానే పాసయ్యారు. ఈ మేరకు పుదుచ్చేరి సర్కారు ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు బోర్డు మార్గదర్శకాల మేరకే ఆ బోర్డు పరిధిలోని స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 10, 11 తరగతుల విద్యార్థులు పాసైనట్లు డిక్లేర్ చేశామని పుదుచ్చేరి ప్రభుత్వం తెలిపింది.
అయితే, ఆ రెండు రీజియన్లలోని తమిళనాడు బోర్డు అనుబంధ పాఠశాలలు, కళాశాలలు మినహా మిగతా బోర్డుల పరిధిలోని స్కూళ్లు, కాలేజీల్లో 10, 11, 12 తరగతుల విద్యార్థులకు మాత్రం ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగేవరకు క్లాసులు నడుస్తాయన్నారు. అదేవిధంగా, పుదుచ్చేరిలోని స్కూళ్లలో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులంతా కూడా పాసైనట్లేనని పుదుచ్చేరి సర్కారు డిక్లేర్ చేసింది. అయితే వారికి కూడా తరగతులు మార్చి 31 వరకు కొనసాగుతాయని, ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులని తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

