ఆ పది రాష్ట్రాల్లోనే 71శాతం కొవిడ్ కేసులు
ఆ పది రాష్ట్రాల్లోనే 71శాతం కొవిడ్ కేసులు | దేశంలో ఒకే రోజు నమోదైన 3,82,315 కరోనా కేసుల్లో 71శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : దేశంలో ఒకే రోజు నమోదైన 3,82,315 కరోనా కేసుల్లో 71శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మంతిత్వశాఖ గణాంకాల ప్రకారం దేశంలో.. కేసులు మొత్తం 2,06,65,148కు చేరాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోనే కొత్త కొవిడ్ కేసుల్లో 70.91శాతం నమోదయ్యాయని మంత్రిత్వశాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌తో సహా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వీక్లీ పాజిటివిటీ రేటు జాతీయ సగటు 21.46శాతం కంటే ఎక్కువగా ఉందని తెలిపింది.

గుజరాత్, అసోం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, తమిళనాడు, బిహార్‌తో సహా 17 రాష్ట్రాలు, యూటీల్లో వీక్లీ పాజిటివిటీ రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని పేర్కొంది. మహారాష్ట్రలో రోజువారీ అత్యధికంగా 51,880 కేసులు నమోదయ్యాయి. తర్వాత కర్ణాటకలో 44,631, కేరళలో 37,190 ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 34,87,229కు చేరాయి. మొత్తం కేసుల్లో 16.87శాతం ఉంది. 24 గంటల వ్యవధిలో 40,096 యాక్టివ్ కేసులు పెరిగాయి. క్రియాశీల కేసుల్లో 12 రాష్ట్రాల్లో 81.25శాతం ఉన్నాయి.

జాతీయ మరణాల రేటు పడిపోతోందని, ప్రస్తుతం 1.09శాతంగా ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది. ఒకే రోజులు మహమ్మారి బారినపడి 3,780 మరణించాడు. కొత్త మరణాల్లో పది రాష్ట్రాల్లోనే 74.97 శాతం ఉన్నాయి. మహారాష్ట్రలో గరిష్ఠంగా 891 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో 351 ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 1,69,51,731కు పెరిగాయి. 24 గంటల్లో 3,38,439 మంది కోలుకున్నారు. రికవరీలో పది రాష్ట్రాల్లోనే 73.4శాతం ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ హాస్పిటల్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
రాష్ట్రానికి మరో రెండు రోజుల వర్ష సూచన
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
వచ్చే వారంలో కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్
కరోనా ఎఫెక్ట్.. 16 రైళ్లను రద్దు చేసిన రైల్వే
డబుల్ మ్యూటెంట్ ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణతో సరిహద్దులు మూసివేసిన ఒడిశా
తెలంగాణలో కొత్తగా 6,361 కరోనా కేసులు
కరోనా విలయం.. 24 గంటల్లో 3.82లక్షల కేసులు.. 3,780 మంది మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

