నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు సమస్యలను అప్పటిమందం చాప కింద దాచిపెట్టడం ఒక పద్ధతి. కొంత ఆలస్యమైనా శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవడం మంచి పద్ధతి. కేసీఆర్ ఎప్పుడూ రెండోదాన్నే ఎంచుకుంటారు. ఆయన చాలావరకు సమస్యను ముందునుంచి వెనకకు శోధిస్తారు. రివర్స్ ఇంజినీరింగ్ అనుకోవచ్చు. తెలంగాణలో వ్యవసాయం ఎందుకు నష్టాల్లో కూరుకుపోయింది? నీళ్లు, కరెంటు లేక. నీళ్లెందుకు లేవు? చెరువులు పాడుబడ్డాయి. చెరువుల్లోకి నీళ్లెట్లా రావాలి? వానలు పడాలి లేదా నదుల నుంచి ఎత్తి పోయాలి. వానలు పడాలంటే ఏం చేయాలి? చెట్లు నాటాలి. నాటితే సరిపోతుందా? వాటిని కాపాడాలి. కాపాడాలంటే ఏం కావాలి? నర్సరీలు, చెట్లు నాటి కాపాడాలనే పౌర స్పృహ. అందుకు ఏం కావాలి? పైసలు. నదుల నీటిని ఎత్తిపోయాలంటే ఏం చేయాలి? బ్యారేజీలు కట్టాలి. అది జరగాలంటే? పొరుగు రాష్ర్టాలతో ముంపు వివాదాలుండొద్దు? దానికి ఏం చేయాలి? ముంపు లేని చోట కట్ట కట్టాలి. ఎండకాలం నది పారకుంటే, ఎత్తిపోతలకు కరెంటు దొరకకుంటే ఎలా? తలాపున సాగరాలు కట్టుకుని వానకాలంలోనే నిల్వ చేసుకోవాలి! మథనం ఇలా సాగుతది. దీంట్లోంచి పుట్టినవే హరితహారం, హరిత నిధి, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు. కేసీఆర్ హైలీ పర్ఫెక్షనిస్టు. ఎక్కువగా ఆలోచించడం వల్ల కొంత ఆలస్యం కావచ్చు. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం ఖాయం
భాషకు అవధులు, ఎల్లలు ఉండవు. ఒక కవి మరొక
కవిని తయారు చేస్తాడు,
ఒక పండితుడు మరొక పండితుడిని తయారు చేస్తాడు, ఈ గురుపరంపర, ఈ సంప్రదాయాలు, ఈ విలక్షణత తెలంగాణలో కొనసాగాలని నేను కోరుకుంటున్నా.
– కేసీఆర్