గువహటి : ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇచ్చే అంకితా కొన్వర్ తరచూ తన వర్కవుట్ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటుంది. బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సొమన్తో ఏడడుగులు వేసిన అంకితా లీజర్ టైమ్ను తనదైన శైలిలో ఆస్వాదిస్తూ ఆయా వీడియోలు, ఫోటోలను నెటిజన్లతో పంచుకుంటుంది.
అంకిత ఇటీవల తన తడిసిన టీషర్ట్తో స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు చేస్తున్న వీడియో ఇన్స్టాలో అప్లోడ్ చేసింది. టీషర్ట్తో షోల్డర్ స్ట్రెచింగ్స్ ఎలా చేయవచ్చని ఈ ఫన్నీ వీడియోలో అంకిత చూపించింది. ఇక అంకిత భర్త బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సొమన్ కూడా ఫిట్నెస్, వర్కవుట్ వీడియోలను తరచూ సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేస్తుంటారు.