World Photography Day | ఒక్క ఫొటోతో ఎన్నో మధుర జ్ఞాపకాలు కదలాడుతాయి. కాలం గిర్రున తిరుగుతున్నప్పటికి ఫొటో చూడగానే వెనక్కి వెళ్లి ఏండ్ల కింది మధురస్మృతులు మనసులో మెదలుతాయి. సంతోషం.. బాధలు.. మధుర ఘట్టాలు.. సాధించిన విజయాలు.. అద్భుత సన్నివేశాలు.. కాలానుగుణంగా ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను బంధించి పదిలంగా దాచుకొని మళ్లీమళ్లీ చూసుకునే అవకాశం ఫొటోతోనే సాధ్యం. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా.. నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ బింగి శ్రీనివాస్ తీసిన ఫొటోలు కొన్ని మీకోసం..