christmas tree | డిసెంబర్ నెల వచ్చేసింది. క్రిస్మస్ వచ్చేస్తోంది. నెల ప్రారంభం నుంచే క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక క్రిస్మస్ అంటే ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ. డిసెంబర్ 25కు ముందు నుంచే క్రైస్తవ సోదరులు ఈ చెట్టును తీసుకొచ్చి తమ ఇంట్లో పెట్టుకుని ప్రత్యేకంగా అలంకరిస్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని మార్కెట్లలో క్రిస్మస్ ట్రీలు సందడి చేస్తున్నాయి.