పెంపుడు కుక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి

అమరావతి: చనిపోయిన పెంపుడు కుక్క విగ్రహాన్ని ఒక వ్యక్తి ఏర్పాటు చేశాడు. ఐదవ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది. అంపాపురానికి చెందిన సుంకర జ్ఞాన ప్రకాశరావుకు ఒక పెంపుడు కుక్క ఉండేది. ఐదేండ్ల కిందట అది చనిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా కుక్క మరణించిన రోజున ఆయన ప్రత్యేక పూజలు చేసేవాడు. కాగా, గురువారం ఐదో వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా కుక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. కుటుంబ సభ్యులతో కలిసి దానికి పూజలు చేయడంతోపాటు బంధు మిత్రులకు భోజనాలు పెట్టాడు. పెంపుడు కుక్కతో తమ కుటుంబానికి 9 ఏండ్ల అనుబంధం ఉన్నదని ప్రకాశరావు తెలిపారు. ఎంతో నమ్మకంతో మెలిగిన దానిని తమ కన్న బిడ్డలా చూసుకున్నామని ఆయన చెప్పారు.
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

