ఈ నెల 15 నుంచి నల్లమలలో వైల్డ్ లైఫ్ టూరిజం.. ట్రెక్కింగ్.. అడవిలోనే రాత్రి వసతి

wild life tourism in nallamala | నల్లమల అందాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తోన్న అమ్రాబాద్ నల్లమల పెద్దపులుల అభయారణ్యంలోని దట్టమైన అడవులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఇది వైల్డ్ లైఫ్ టూరిజం ప్యాకేజీతో పర్యాటకుల కలను సాకారం చేయనున్నది. 15వ తేదీ నుంచి అమలవుతున్న ఈ ప్రత్యేక కార్యాచరణతో రాబోయే రోజుల్లో నల్లమల ప్రాంతం పర్యాటక శోభను సంతరించుకోనున్నది.

ప్రతి రోజూ 12 మందిని ఈ ప్యాకేజీ కింద అటవీ ప్రాంతంలో ఒక రోజు ఉండే అవకాశం ఉంది. దీనికోసం పర్యాటకులు ఆన్లైన్లో amrabadtigerreserve.com వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మూడు రకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఇందులో ఒకటోది ఇద్దరికి ఏసీ గదిలో రెండు పడకల కాటేజీలో బసకు రూ.4,600, రెండోది రూ.7 వేలతో నలుగురికి, రూ.9,200తో ఆరుగురికి అవకాశం ఉంటుంది. ఆరేండ్ల చిన్నపిల్లలకు మాత్రం ఎలాంటి చార్జీలు ఉండవు. కాగా టిఫిన్లు, నీళ్లు, ఆహారానికి ప్రత్యేకంగా చార్జీలు ఉంటాయి.
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

