Yogi vs Akhilesh Yadav | ‘మట్టిలో కలిపేస్తా’.. అఖిలేష్‌ను ఉద్దేశించి సీఎం యోగి ఘాటుగా వ్యాఖ్య
Yogi vs Akhilesh Yadav | అఖిలేష్ వైపు వేలు చూపుతూ.. ‘స్పీకర్ సార్, అన్ని ప్రొఫెషనల్ క్రిమినల్స్, మాఫియాకు గాడ్ ఫాదర్ ఆయనే. వారి సిరల్లో నేరాలున్నాయి. ఈ రోజు నేను ఈ సభకు చెబుతున్నా.. ఈ మాఫియాను మట్టి కరిపిస్తా’ అని ఉద్వేగంతో యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో శనివారం రెచ్చిపోయారు. ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav ) పై ఆయన మండిపడ్డారు. అఖిలేష్ వైపు వేలు చూపుతూ ‘మాఫియాను మట్టిలో కలిపేస్తాం’ (mitti mein mila donga) అని ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత యూపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యలో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్, అతడి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిని శుక్రవారం పట్టపగలు ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపడంపై విపక్షాలు మండిపడ్డాయి.
సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ సందర్భంగా తన శైలికి భిన్నంగా వ్యవహరించారు. అఖిలేష్ యాదవ్ వైపు వేలు చూపుతూ ‘బాధితురాలి కుటుంబం ఆరోపించిన అతిక్ అహ్మద్, సమాజ్ వాదీ పార్టీ పెంచి పోషిస్తున్న మాఫియాలో భాగం కాదా?’ అని ప్రశ్నించారు. ఆ మాఫియా వెన్ను విరిచేందుకు మేం కృషి చేస్తున్నాం అని అన్నారు. అలాగే అఖిలేష్ వైపు వేలు చూపుతూ.. ‘స్పీకర్ సార్, అన్ని ప్రొఫెషనల్ క్రిమినల్స్, మాఫియాకు గాడ్ ఫాదర్ ఆయనే. వారి సిరల్లో నేరాలున్నాయి. ఈ రోజు నేను ఈ సభకు చెబుతున్నా.. ఈ మాఫియాను మట్టి కరిపిస్తా’ అని ఉద్వేగంతో యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
కాగా, సీఎం యోగి వ్యాఖ్యలతో సభలో గందరగోళం చెలరేగింది. దీంతో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సభలో మాట్లాడారు. ‘నేరస్థులు మీ వాళ్లే’ అంటూ ఎదురుదాడికి దిగారు. ‘రామరాజ్యం’లో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ‘పట్ట పగలే కాల్పులు జరుగుతున్నాయి. బాంబులు విసురుతున్నారు. సాక్షిని చంపారు. పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? డబుల్ ఇంజన్లు ఎక్కడ ఉన్నాయి? ఇది సినిమా షూటింగా?’ అంటూ మండిపడ్డారు.
మరోవైపు సీఎం యోగి మళ్లీ ఘాటుగా స్పందించారు. అతిక్ అహ్మద్ మాఫియాను పెంచి పోషించింది, రక్షించేది సమాజ్‌వాదీ పార్టీ అని విమర్శించారు. వారు ఇప్పుడు మాపై వేలు చూపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దోషులను వదిలి పెట్టబోమని అన్నారు. మాఫియా, నేరాలపై తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్ పాలసీ’ని అమలు చేస్తున్నదని చెప్పారు. ప్రయాగ్‌రాజ్ విషయంలో కూడా ప్రభుత్వం దీని ప్రకారం వ్యవహరిస్తుందని అన్నారు. ‘బీఎస్సీ ఎమ్మెల్యే హత్యా ఘటనలో పాల్గొన్న వారిని సమాజ్‌వాదీ పార్టీ పెంచి పోషించలేదా? సమాజ్‌వాదీ పార్టీ ఆయనను (అతిక్ అహ్మద్) ఎంపీ చేసింది’ అని ఆదిత్యనాథ్ విమర్శించారు. ఈ సందర్భంగా ‘నువ్వు సిగ్గుపడాలి, నీ తండ్రిని కూడా నువ్వు గౌరవించలేదు’ అని అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి సీఎం యోగి అన్నారు. దీంతో సభలో మరోసారి గందళగోళం చెలరేగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

