అధికారంలో ఉన్నప్పుడు యోగిపై చర్యలకు ఫైల్ వచ్చింది.. ప్రతీకారం తీర్చుకోలేదు: అఖిలేష్ యాదవ్
తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఒక ఫైల్ తన వద్దకు వచ్చిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తెలిపారు.
లక్నో: తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఒక ఫైల్ తన వద్దకు వచ్చిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తెలిపారు. అయినప్పటికీ ద్వేషం, ప్రతీకార రాజకీయాలకు తాము పాల్పడలేదని చెప్పారు. అందుకే ఆ ఫైల్‌ను వెనక్కి పంపినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో తమను కఠినంగా చేయవద్దని ఆయన సూచించారు. లేనిపక్షంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కాగా, ఎస్పీ వ్యవస్థాపకుడు, అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన రాంపూర్ ఎంపీ స్థానంలో అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈ నెల 5న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగనున్నది. ఈ నేపథ్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన అఖిలేష్ యాదవ్, యూపీలోని అధికార బీజేపీపై ఈ మేరకు మండిపడ్డారు. అలాగే డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, అయితే ఆ ప్రయత్నంలో వారిద్దరూ విఫలమయ్యారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంలైన కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌కు తాము ఒక ఆఫర్ ఇస్తున్నామని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ‘వాళ్లకు ఆఫర్ ఇచ్చేందుకు మేం ముందుకొచ్చాం. మా నుంచి 100 మంది ఎమ్మెల్యేలను తీసుకోండి. మేం మీ వెంట ఉంటాం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం అవ్వండి’ అని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

