Brij Bhushan | రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు సమన్లు.. 18న కోర్టుకు హాజరుకావాలని ఆదేశం
Brij Bhushan Sharan Singh | మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు (Brij Bhushan Sharan Singh) కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు (Brij Bhushan Sharan Singh) కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి బ్రిజ్ భూషణ్‌ను విచారించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ కోసం కోర్టుకు రావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసింది.
కాగా, బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించినట్లు పలువురు మహిళా రెజ్లర్లు ఆరోపించారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెండోసారి కూడా కొన్ని రోజుల పాటు నిరసనకు దిగారు.
మరోవైపు రెజర్లు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దిగివచ్చారు. జూన్ 2న పలు సెక్షన్ల కింద బీజేపీ ఎంపీపై రెండు కేసులు నమోదు చేశారు. జూన్ 15న ఛార్జిషీట్ కూడా ఫైల్ చేశారు. లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు వంటి అభియోగాలను అందులో పేర్కొన్నారు. అయితే మహిళా రెజ్లర్లు తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణలను బ్రిజ్ భూషణ్ పలుమార్లు ఖండించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

