iNCOVACC | ప్రపంచంలోనే తొలి కొవిడ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ను ఈ నెల 26న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా ప్రకటించారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MANIT)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఇంకోవాక్ కొవిడ్ టీకాను గణతంత్ర దినోత్సవం రోజున అధికారికంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇంకోవాక్ (iNCOVACC)ను కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్న వారికి బూస్టర్ డోస్గా ఇచ్చేందుకు డిసెంబర్ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిఫారసు మేరకు అత్యవసర వినియోగ అవసరం కింద 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఇచ్చేలా అనుమతులు జారీ చేసింది.
ఒక్కో డోసును కేంద్రం, రాష్ట్రాలకు రూ.325, ప్రైవేటు టీకా కేంద్రాలకు రూ.800తో పాటు అదనంగా జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ కోసం కొవిన్ వైబ్సైట్లో ఇంట్రానాసల్ వ్యాక్సిన్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది.