Basmati Rice | రుచిలో రారాజు భారతీయ బాస్మతి.. ఉత్తమ బియ్యంగా ప్రపంచ కిరీటం
రుచి, నాణ్యతకు మారుపేరైన భారత్‌లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకుందని ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రకటించింది. 2023-24 ఏడాదికి ప్రకటించిన అవార్డుల సందర్భంగా బాస్మతిపై ప్రశంసల వర్షం కురిపించింది.
Basmati Rice | న్యూఢిల్లీ, జనవరి 13: రుచి, నాణ్యతకు మారుపేరైన భారత్‌లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకుందని ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రకటించింది. 2023-24 ఏడాదికి ప్రకటించిన అవార్డుల సందర్భంగా బాస్మతిపై ప్రశంసల వర్షం కురిపించింది. పొడవైన ధాన్యం బియ్యం రకానికి చెందిన బాస్మతిని భారత్, పాకిస్థాన్లలో పండిస్తుంటారు. బాస్మతి బియ్యం వండిన తర్వాత దాని నుంచి మంచి వచ్చే సుగంధ పరిమళం, రుచి, స్వల్పంగా ఉండే కారం దానికో ప్రత్యేకతను చేకూరుస్తాయి.
ఎలాంటి కూరలు, సాస్‌లు, సూప్‌లు ఇతర పదార్ధాలలోనైనా దీనిని సులభంగా కలుపుకుని తినవచ్చు. ఇక బాస్మతి బియ్యంతో తయారు చేసే బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులున్నారు. బాస్మతి తర్వాత రెండో స్థానంలో ఇటలీకి చెందిన అర్బోరియా, మూడో స్థానంలో పోర్చుగల్‌కు చెందిన కరోలినా బియ్యం నిలిచాయి. ఇక నాలుగైదు, స్థానాలను స్పెయిన్, జపాన్ బియ్యం దక్కించుకున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

