Temperature | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితి మించి నమోదయ్యాయని యూరోపియన్ ైక్లెమేట్ ఏజెన్సీ తాజాగా ప్రకటించిం ది. 2023 ఫిబ్రవరి-2024 జనవరి మధ్య 12 నెలల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైందని, పా రిశ్రామిక యుగం (1850-1900) ముం దు నాటితో పోల్చితే ఇది అత్యధికమని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది.
అంతేగాక ఈ ఏడాది జనవరిలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత రికార్డ్‌స్థాయిలో 1.66గా నమోదైందని తెలిపింది. ఒక ఏడాది కాలంలో ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదు కావటం ఇదే మొట్టమొదటిసారి అని ఆందోళన వ్యక్తం చేసింది.