Chandigarh mayoral polls | ప్రజాస్వామ్యం ఖూనీకి అనుమతించం.. చండీగఢ్ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టు
Chandigarh mayoral polls | ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని తాము అనుమతించబోమని సుప్రీంకోర్టు పేర్కొంది. చండీగఢ్ మేయర్ ఎన్నికలపై (Chandigarh mayoral polls) సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారి చేసిన పని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లేనని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మండిపడ్డారు.
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని తాము అనుమతించబోమని సుప్రీంకోర్టు పేర్కొంది. చండీగఢ్ మేయర్ ఎన్నికలపై (Chandigarh mayoral polls) సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారి చేసిన పని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లేనని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మండిపడ్డారు. ‘ఆయన కెమెరా వైపు చూస్తూ బ్యాలెట్ పేపర్లు పాడు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. సాయంత్రం 5 గంటలలోపు అన్ని రికార్డులను భద్రపరచాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు.
కాగా, మంగళవారం సమర్పించాలని భావించిన చండీగఢ్ పాలనా యంత్రాంగం బడ్జెట్ సెషన్‌ను కూడా సుప్రీంకోర్టు స్తంభింపజేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బడ్జెట్‌ను సమర్పించవద్దని న్యాయమూర్తులు చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.
జనవరి 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్‌కు చెందిన 8 ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి అనిల్ పేర్కొన్నారు. దీంతో 16 ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దీనిపై తొలుత పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రిసైడింగ్ అధికారి ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. బ్యాలెట్ పేపర్లను ట్యాంపరింగ్ చేసిన ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
చండీగఢ్ మేయర్ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని తన పిటిషన్లో ఆప్ పేర్కొంది. బ్యాలెట్ పేపర్లను తారుమారు చేయడంతో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలో చండీగఢ్ మేయర్ ఎన్నికలను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

