Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Delhi Police : ప్రజాస్వామ్యబద్దంగా చేపడతున్న నిరసనల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడిని నిరసిస్తూ పలు మహిళా సంఘాలు శనివారం ర్యాలీ నిర్వహించాయి. ఢిల్లీలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ర్యాలీ జరిగింది.
Delhi Police : సీఈసీ జ్ఞానేష్ కుమార్కు, సర్కు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సీజేపీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇండియా బ్లాక్, ఇతర విద్యార్థి సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ ఆందోళనల్లో భారీగా మహిళలు కూడా పాల్గొంటున్నారు. అయితే, వీరిలో చాలామందిపై లైంగిక దాడి, హింస జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా చేపడతున్న నిరసనల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడిని నిరసిస్తూ పలు మహిళా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఢిల్లీలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు పలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ జరిగింది. ఇలా ఆందోళనకారులపై దాడి చేయడం సిగ్గుచేటు అంటూ వారు నినదించారు. ఈ ర్యాలీలో ఐద్వా (AIDWA), ఐప్వా (AIPWA), ఎన్ఎఫ్ఐడబ్ల్యూ (NFIW), ఏఐఎంఎస్ఎస్ (AIMSS), అలిఫా (ALIFA). ఎస్ఎఫ్ఐ (SFI) వంటి సంస్థలు పాల్గొన్నాయి.
ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా వారు నినదించారు. మహిళలపై హింస, లైంగిక హింసను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టులపై కూడా కొందరు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. గురుద్వారా బంగ్లా సాహిబ్ నుంచి ఢిల్లీ పోలీసుల ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పోలీసు ఉన్నతాధికారులకు మెమోరాండం సమర్పించారు. ఈ మేరకు కొన్ని వీడియో ఆధారాల్ని కూడా వారు సమర్పించారు.
గత జూలై 20 నుంచి అక్టోబర్ 2వరకు ఈ దాడులు జరిగాయని పేర్కొన్నారు. తమపై దాడులు, హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు విఫలమయ్యారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

