lakh guarantee card | లక్ష గ్యారెంటీ కార్డు కోసం.. కాంగ్రెస్ కార్యాలయం వద్ద మహిళల క్యూ
lakh guarantee card | మహిళలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద బారులు తీరారు. లోక్‌సభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన లక్ష గ్యారెంటీ కార్డు కోసం డిమాండ్ చేశారు. ప్రచారం సమయంలో పంపిణీ చేసిన గ్యారెంటీ కార్డులను కాంగ్రెస్ కార్యాలయంలో సమర్పించిన కొందరు రసీదులు కూడా పొందారు.
లక్నో: మహిళలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద బారులు తీరారు. లోక్‌సభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన లక్ష గ్యారెంటీ కార్డు (lakh guarantee card) కోసం డిమాండ్ చేశారు. ప్రచారం సమయంలో పంపిణీ చేసిన గ్యారెంటీ కార్డులను కాంగ్రెస్ కార్యాలయంలో సమర్పించిన కొందరు రసీదులు కూడా పొందారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ‘ఘర్ ఘర్ హామీ’ కార్యక్రమం కింద 25 పథకాలు పేర్కొంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబంలో పెద్ద అయిన మహిళ బ్యాంకు ఖాతాలో నెలకు రూ.8,500 జమ చేస్తామని హామీ ఇచ్చింది.
కాగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం సీట్లలో సగం వరకు ‘ఇండియా’ కూటమి దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని లక్నోలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన లక్ష గ్యారంటీ కార్డుల కోసం డిమాండ్ చేశారు. పలు ఇండ్లకు పంపిణీ చేసిన ‘ లక్ష గ్యారెంటీ కార్డు’కు సంబంధించిన ఫారాలను కొందరు పూర్తి చేశారు. కాంగ్రెస్ కార్యాలయంలోని సిబ్బందికి వాటిని ఇచ్చి రసీదు కూడా పొందారు. రూ.లక్ష నగదు తమ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని ఆ మహిళలు ఆశిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

