లక్నో: కట్నంగా బైక్ ఇవ్వనందుకు అత్తింటి వారు చిత్రహింసలకు పాల్పడ్డారు. మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. (Woman Tied To Tree, Brutally Thrashed) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 6న అత్రౌలీ గ్రామంలో ఒక మహిళను అత్తింటి వారు దారుణంగా హింసించారు. ఆమె తండ్రి మరణించడంతో కట్నంగా బైక్ ఇవ్వలేకపోవడంపై వారు ఆగ్రహించారు. ఆ మహిళను ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. ఆమెను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. దీంతో ఆ మహిళ బాధతో ఏడ్చింది. గ్రామస్తులంతా దీనిని చోద్యం చూశారు. ఆ యువతిని కాపాడేందుకు ఎవరూ ముందుకురాలేదు.
కాగా, ఈ విషయం తెలిసిన పుట్టింటి వారు ఆ గ్రామానికి చేరుకున్నారు. మహిళను కాపాడి తమతో తీసుకెళ్లారు. అనంతరం అత్తింటి వారిపై పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. చనిపోయిన తండ్రి కట్నంగా బైక్ ఇవ్వకపోవడంపై భర్త, అత్తమామలు, మరిది వేధించడంతోపాటు చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపించింది. మామ, మరిది తన పట్ల అసభ్యంగా ప్రవర్తించగా అడ్డుచెప్పడంతో దారుణంగా కొట్టారని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उफ्फ ये हैवान! इस वीडियो ने रूह को दहला दिया है। यह उत्तर प्रदेश के अलीगढ़ जनपद के अतरौली का है। जहां ससुराल पक्ष के विवाहिता को पेड़ से बांधकर बेरहमी से पीटा है। @dgpup @myogiadityanath @Uppolice ऐसे हैवानों का ऐसा ईलाज कीजिए जो नज़ीर बन जाए। ये मानसिकता और ये लोग समाज पर धब्बा… pic.twitter.com/SYesV3qqE9
— Wasim Akram Tyagi (@WasimAkramTyagi) June 7, 2024