Woman Stabbed In Neck | పెళ్లికి నిరాకరించిన మరదలు.. మెడపై కత్తితో పొడిచిన బావ
Woman Stabbed In Neck | పెళ్లికి నిరాకరించడంతో మరదలుపై బావ దాడి చేశాడు. ఆమె మెడపై కత్తితో పొడిచాడు. (Woman Stabbed In Neck) తీవ్రంగా గాయపడిన ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
లక్నో: పెళ్లికి నిరాకరించడంతో మరదలుపై బావ దాడి చేశాడు. ఆమె మెడపై కత్తితో పొడిచాడు. (Woman Stabbed In Neck) తీవ్రంగా గాయపడిన ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల మహిళ తన మేనమామ ఇంట్లో ఉంటున్నది. బావ అయిన 26 ఏళ్ల జ్ఞాన ప్రకాష్, ఆమె ఒకే కాలేజీలో లా చదువుతున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రకాష్ తన మరదలు వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో మరదలు మెడపై కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, తీవ్రంగా గాయపడిన మహిళను ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పరారిలో ఉన్న నిందితుడు ప్రకాష్ కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

