Woman Slits Throat of Infant | ఆడపిల్ల ఇష్టం లేదని.. 9 రోజుల పసిబిడ్డ గొంతు కోసి చంపిన తల్లి
Woman Slits Throat of Infant | ఆడపిల్ల ఇష్టం లేని తల్లి దారుణానికి పాల్పడింది. 9 రోజుల పసిబిడ్డ గొంతు కోసి చంపింది. ఇది గమనించిన ఆమె భర్త షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళను అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ఆడపిల్ల ఇష్టం లేని తల్లి దారుణానికి పాల్పడింది. 9 రోజుల పసిబిడ్డ గొంతు కోసి చంపింది. (Woman Slits Throat of Infant) ఇది గమనించిన ఆమె భర్త షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళను అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఔటర్ ఢిల్లీ ముండ్కా ప్రాంతంలోని బాబా హరిదాస్ కాలనీలో నివసిస్తున్న 22 ఏళ్ల మహిళ తొమ్మిది రోజుల కిందట శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేక దారుణానికి పాల్పడింది. గురువారం కత్తితో పసికందైన కూతురి గొంతు కోసి హత్య చేసింది.
కాగా, ఇది తెలిసి ఆ మహిళ భర్త గోవింద్ షాక్ అయ్యాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. రెండో అంతస్తులోని ఒక గదిలో పసికందు మృతి చెంది ఉండగా, మరో గదిలో తల్లి ఉండటాన్ని గమనించారు. ఆ మహిళను ప్రశ్నించగా తనకు ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేదని అందుకే చంపేశానని పోలీసులకు చెప్పింది. అక్కడ పడి ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Infant Daughter
- Slits
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

