ప్రేమంటే ఇదేరా.. భర్త ఒడిలో హాయిగా నిద్రిస్తున్న భార్య.. వీడియో వైరల్
Heartwarming video | ప్రేమకు హద్దులు లేవు.. ఎల్లలు లేవు. ప్రేమించే మనసు ఉండాలి కానీ.. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమించుకోవచ్చు. పెళ్లికి ముందే కాదు.. పెళ్లి తర్వాత కూడా గాఢంగా ప్రేమించుకోవచ్చు. అలా ఒకరి పట్ల మరొకరికి ప్రేమ లభిస్తే.. ఆ
Heartwarming video | ప్రేమకు హద్దులు లేవు.. ఎల్లలు లేవు. ప్రేమించే మనసు ఉండాలి కానీ.. అష్ట ఐశ్వర్యాలు అవసరం లేదు. ప్రేమించుకోవడానికి బహుళ అంతస్తులే కావాల్సిన అవసరం లేదు. కటిక నేలపై కూడా ప్రేమించుకోవచ్చు. ప్రేమకు డబ్బు, హోదా అవసరం లేదు.. మంచి మనసు ఉంటే చాలు. పెళ్లికి ముందే కాదు.. పెళ్లి తర్వాత కూడా గాఢంగా ప్రేమించుకోవచ్చు. అలా ఒకరి పట్ల మరొకరికి ప్రేమ లభిస్తే.. ఆ జంట పరిపూర్ణమైన జీవితాన్ని గడిపేయొచ్చు. అంతే కాదు ఆ ఇంట ఎల్లప్పుడూ సుఖసంతోషాలు వర్ధిల్లుతాయి. అలాంటి ప్రేమికులు ఇంట, బయట ఎక్కడైనా తన భాగస్వామిని ప్రేమిస్తూనే ఉంటారు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం అని చెప్పొచ్చు.
ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రైలు కోసం స్టేషన్లో ఎదురు చూస్తున్నాడు. రైలు రావడానికి సమయం ఉండటంతో.. అలసిపోయిన భార్య.. అలా భర్త ఒడిలో సేద తీరుతోంది. భర్త కూడా నొచ్చుకోలేదు. భార్యపై ఉన్న ప్రేమ, అభిమానంతో ఆమెను నిద్రపుచ్చాడు. తలపై చేతితో నిమురుతూ, చంటి బిడ్డను చూసుకున్నట్లే భార్యను చూసుకుని, తన గొప్ప ప్రేమను చాటుకున్నాడు. అతనికి కూడా నిద్ర వస్తున్నప్పటికీ, భార్యను హాయిగా పడుకోబెట్టాడు. భార్య పట్ల భర్త గుండెల నిండా ఉన్న ఆ ప్రేమకు ప్రేమికులు, నెటిజన్లు హాట్యాఫ్ చెప్తున్నారు.
అయితే ఈ వీడియో కర్ణాటకలోని ఏదో ఒక రైల్వే స్టేషన్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి.. జీవిత ప్రయాణంలో నిజమైన సహచరుడు మీ పక్కనే ఉంటాడు అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 57 వేల మంది వీక్షించారు. వీరి ప్రేమ గొప్పది అని చాలా మంది తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
हमसफर वही जो हर सफर में आपके साथ हो ❤️🥰 pic.twitter.com/QbyVbZi4AE
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 19, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

