Belly Dance | రీల్ కోసం రైల్వే స్టేషన్ వద్ద మహిళ బెల్లీ డ్యాన్స్.. వీడియో వైరల్
Belly Dance | సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చాలా మంది తంటాలు పడుతుంటారు. ఇందులో భాగంగా ఒక మహిళ ఏకంగా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ వద్ద బెల్లీ డ్యాన్స్ చేసింది. ప్రయాణికులు నడిచి వెళ్లే ఫుట్‌పాత్‌పై రీల్ చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చాలా మంది తంటాలు పడుతుంటారు. ఇందులో భాగంగా ఒక మహిళ ఏకంగా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ వద్ద బెల్లీ డ్యాన్స్ (Belly Dance) చేసింది. ప్రయాణికులు నడిచి వెళ్లే ఫుట్‌పాత్‌పై రీల్ చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) స్టేషన్ బయట ఒక మహిళ బెల్లీ డ్యాన్స్ చేసింది. రీల్ షూటింగ్ కోసం ప్రయాణికులు నడిచి వెళ్తే ఫుట్‌పాత్‌ను ఆమె ఆక్రమించింది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రద్దీగా ఉండే సీఎస్ఎంటీ ఫుట్‌పాత్‌ను రీల్ కోసం ఆమె వినియోగించడంపై నెటిజన్లు మండిపడ్డారు. ఇప్పటికే వీధి వ్యాపారులు ఆ ఫుట్‌పాత్‌ను చాలా వరకు ఆక్రమించారని ఆరోపించారు. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. ముంబైకి ఈ (రీల్) రోగం చేరిందని మరొకరు కామెంట్ చేశారు.
Mast hokar naachi Re
— Peter Quill / Star Lord (@starlordindia) April 11, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

