Woman Molested In Ambulance | అంబులెన్స్‌లో మహిళకు లైంగిక వేధింపులు.. అనారోగ్యంతో ఉన్న ఆమె భర్తకు ఆక్సిజన్ తీసి బయటకు తోసివేత
Woman Molested In Ambulance | అనారోగ్యంతో ఉన్న భర్తను అంబులెన్స్‌లో తీసుకెళ్తున్న మహిళ పట్ల డ్రైవర్, మరో వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రతిఘటించడంతో ఆమె భర్తకు ఆక్సిజన్ సపోర్ట్ తీసేశారు. భర్తతోపాటు ఆ మహిళను అంబులెన్స్ నుంచి బయటకు తోసేశారు.
లక్నో: అనారోగ్యంతో ఉన్న భర్తను అంబులెన్స్‌లో తీసుకెళ్తున్న మహిళ పట్ల డ్రైవర్, మరో వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెను లైంగికంగా వేధించారు. (Woman Molested In Ambulance) ఆ మహిళ ప్రతిఘటించడంతో ఆమె భర్తకు ఆక్సిజన్ సపోర్ట్ తీసేశారు. భర్తతోపాటు ఆ మహిళను అంబులెన్స్ నుంచి బయటకు తోసేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 30న అనారోగ్యంతో ఉన్న భర్త హరీష్‌ను సమీపంలోని బస్తీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు అతడి భార్య తీసుకెళ్లింది. ఆ వ్యక్తి ఆరోగ్యం క్షీణించడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.
కాగా, ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లే స్థోమత లేకపోవడంతో ఆ మహిళ తన భర్తను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్లసాగింది. ఈ సందర్భంగా ఆమెను ముందు సీటులో కూర్చోవాలని డ్రైవర్ బలవంతం చేశాడు. అతడితోపాటు మరో వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ మహిళ ప్రతిఘటించడంతో అంబులెన్స్‌ను నిలిపివేశారు. ఆమె భర్తకు ఆక్సిజన్ సపోర్ట్ తీసేశారు. వారిద్దరిని అంబులెన్స్ నుంచి బయటకు తోసేశారు. దీంతో గాయపడిన ఆమె భర్త ఆరోగ్యం మరింతగా క్షీణించింది.
మరోవైపు ఆ మహిళ తన సోదరుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు గాయపడిన మహిళ భర్తను గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అనంతరం బాధిత మహిళ అంబులెన్స్ డ్రైవర్, సహాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

