Woman Kills Husband During Karwa Chauth | కర్వా చౌత్ ఉపవాసం తర్వాత.. భర్తకు విషమిచ్చి చంపిన భార్య
Woman Kills Husband During Karwa Chauth | భర్త క్షేమం, దీర్ఘాయుష్షు కోసం చేసే కర్వా చౌత్ సందర్భంగా ఒక మహిళ రోజంతా ఉపవాసం ఉండి పూజలు చేసింది. ఆ తర్వాత భర్తకు విషమిచ్చి చంపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఆ మహిళను అరెస్ట్ చేశారు.
లక్నో: భర్త క్షేమం, దీర్ఘాయుష్షు కోసం చేసే కర్వా చౌత్ సందర్భంగా ఒక మహిళ రోజంతా ఉపవాసం ఉండి పూజలు చేసింది. ఆ తర్వాత భర్తకు విషమిచ్చి చంపింది. (Woman Kills Husband During Karwa Chauth) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కడ ధామ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 32 ఏళ్ల శైలేష్ కుమార్, అతడి భార్య సవిత ఆదివారం కర్వా చౌత్ ఆచరించారు. ఈ సందర్భంగా భర్త దీర్ఘాయుష్షు కోసం సవిత పూజలు చేయడంతోపాటు ఉపవాసం కూడా ఉన్నది. శైలేష్ కూడా భార్య పూజల కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు.
కాగా, ఆదివారం సాయంత్రం సవిత ఉపవాసాన్ని విరమించింది. కొద్ది సేపటికే భర్త శైలేష్‌తో ఆమె వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేశారు. అయితే తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని సవిత అనుమానించింది. ఈ నేపథ్యంలో విషం కలిపిన ఆహారాన్ని అతడికి పెట్టింది. భోజనం తర్వాత పొరుగింటికి వెళ్లి ఏదో తీసుకురమ్మని భర్తను పంపింది. అతడు బయటకు వెళ్లగానే ఆ ఇంటి నుంచి ఆమె పారిపోయింది.
మరోవైపు విషాహారం తిన్న శైలేష్ కొంత సేపటికి తీవ్ర అవస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయం తెలిసిన సోదరుడు అతడ్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. విషం కలిపిన ఆహారాన్ని భార్య పెట్టిందని శైలేష్ చెప్పగా సోదరుడు ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు శైలేష్ భార్య సవితను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Fast
- Husband
- Karwa Chauth
- Kills
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

