Watch: సహజీవనం చేస్తున్న వ్యక్తిని బెదిరించేందుకు రైలు పట్టాలపైకి దూకిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
woman jumps on railway track | సహజీవనం చేస్తున్న వ్యక్తిని బెదిరించేందుకు మహిళ ప్రయత్నించింది. ఉన్నట్టుండి రైలు పట్టాలపైకి దూకింది. అయితే రైలు రావడాన్ని గమనించి ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చేందుకు ఆమె ప్రయత్నించింది. ఇంతలో రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య చిక్కుకుని నలిగిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: సహజీవనం చేస్తున్న వ్యక్తిని బెదిరించేందుకు మహిళ ప్రయత్నించింది. ఉన్నట్టుండి రైలు పట్టాలపైకి దూకింది. (woman jumps on railway track) అయితే రైలు రావడాన్ని గమనించి ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చేందుకు ఆమె ప్రయత్నించింది. ఇంతలో రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య చిక్కుకుని నలిగిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల రాణి, కిషోర్ అనే వ్యక్తితో కలిసి ఏడాదిగా సహజీవనం చేస్తున్నది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో కిషోర్ ఇంటికి తిరిగి వచ్చాడు. దీని గురించి వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సూసైడ్ చేసుకుంటానని ఆమె బెదిరించింది. అంతేగాక ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు అతడ్ని తీసుకెళ్లింది.
కాగా, సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రైల్వే స్టేషన్‌లోని బెంచ్‌పై రాణి, కిషోర్ కూర్చొన్నారు. అతడు మద్యం సేవించడంపై వారిద్దరి మధ్య గొడవ కొనసాగింది. ఈ నేపథ్యంలో కిషోర్‌ను బెదిరించేందుకు రాణి ప్రయత్నించింది. ఒక్కసారిగా ప్లాట్‌ఫారమ్ పైనుంచి రైలు పట్టాలపైకి ఆమె దూకింది.
మరోవైపు ఎక్స్‌ప్రెస్ రైలు రావడాన్ని రాణి గమనించింది. దీంతో ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చేందుకు ఆమె ప్రయత్నించింది. అయితే రైలు సమీపించడంతో ప్లాట్‌ఫారమ్ మధ్య నలిగి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఆ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
लिविंग में रह रही थी आगरा लोहा मंडी की शादीशुदा महिला, प्रेमी से हुई तकरार और राजा मंडी रेलवे स्टेशन केरला एक्सप्रेस के सामने लगा दी छलांग. 30 सेकंड का बेहद दर्दनाक वीडियो ।@agrapolice @spgrpagra pic.twitter.com/mdDLZAeXei
— Journalist Harikant sharma (@harikantsharmaG) May 27, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

