Baby With 2 Faces, 4 Legs, 4 Arms | రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో పుట్టిన శిశువు.. వీడియో వైరల్
Baby With 2 Faces, 4 Legs, 4 Arms | ఒక మహిళ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. నవజాత శిశువుకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. వింతగా పుట్టిన ఆ శిశువును చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: ఒక మహిళ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. నవజాత శిశువుకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. (Baby With 2 Faces, 4 Legs, 4 Arms) వింతగా పుట్టిన ఆ శిశువును చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కిరాతాపూర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల రమాదేవి నిండు గర్భిణి. ఆదివారం అర్ధరాత్రి ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో రేవన్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు అసాధారణ శిశువుకు రమాదేవి జన్మనిచ్చింది. ఆ బాబుకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. వింతగా పుట్టిన ఆ శిశువును చూసి వైద్యులు, నర్సులు షాక్ అయ్యారు. అయితే ఆ శిశువు శరీరం మరో శిశువు శరీరానికి అతుక్కుపోయిందని డాక్టర్లు తెలిపారు. ఒక శరీరం అభివృద్ధి చెందగా మరో శరీరం అభివృద్ధి చెందలేదని చెప్పారు. దీంతో ఆ బాబుకు రెండు ముఖాలు, నాలుగు కాళ్ళు, నాలుగు చేతులు ఉన్నాయని అన్నారు.
మరోవైపు వింతగా పుట్టిన శిశువును చూసేందుకు గ్రామస్తులు ఆసుపత్రికి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే పుట్టిన ఐదు గంటల తర్వాత ఆ పసి బాబు మరణించాడు. దీంతో శిశువు తల్లిదండ్రులు ఆవేదన చెందారు. కాగా, వింత శిశువు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
सीतापुर – रेवान सांडा पीएचसी में अद्भुत बालक का जन्म
➡बालक के चार पैर, चार हाथ बना चर्चा का विषय
➡बालक का समूर्ण दूसरा शरीर एक में ही जुड़ा हुआ
➡बच्चे को देखने के लिए उमड़ रही सैकड़ों की भीड़#Sitapur | #BreakingNews | #BharatSamachar pic.twitter.com/dvnjc6G8Ch— भारत समाचार | Bharat Samachar (@bstvlive) July 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

