అహ్మదాబాద్: క్షామ బిందు..! ఈమె గుజరాత్‌కు చెందిన యువతి..! ఏడాది క్రితం ఈ యువతి స్వీయ వివాహం (తనను తానే పెళ్లి చేసుకోవడం) చేసుకుంది. నుదుట సింధూరం దిద్దుకుని, పెళ్లికూతురులా ముస్తాబయ్యి తనను తానే పెళ్లి చేసుకుంది. ఈమె పెళ్లి అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక వ్యక్తి తనను తానే పెళ్లి చేసుకోవడం ఏంటి అనే ప్రశ్నలు రేకెత్తాయి.
అప్పుడు ఆ విధంగా వార్తల్లో నిలిచిన క్షామ బిందు ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అప్పుడు తనను తాను పెళ్లి చేసుకుని దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిన క్షామ.. ఇప్పుడు మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుని మరోసారి దేశ ప్రజల దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. అంతేగాక తొలి పెళ్లిరోజు సందర్భంగా ఓ వీడియోను రూపొందించింది. తన ఎద పై భాగంలో వేసుకున్న టాటూలను ఆ వీడియోలో ప్రదర్శించింది.
అదేవిధంగా తన పుట్టిన రోజులు, ఏడాది క్రితం జరిగిన పెళ్లి వేడుక, ఇతర సందర్భాల్లో దిగిన ఫొటోలను ఆ వీడియోలో చేర్చింది. ఆపై ఆ వీడియోకు ‘హ్యాప్పీ ఫస్ట్ యాన్నివర్సరీ (Happy 1st Anniversary)’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చి తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. హ్యాప్పీ యాన్నివర్సరీ, కంగ్రాట్చులేషన్స్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.