మహారాష్ట్ర అడవిలో బందీగా అమెరికా మహిళ
తనతో గొడవ పడిన భార్యను అడవికి తీసుకెళ్లి గొలుసుతో ఆమె కాళ్లను చెట్టుకు కట్టేసి పరారయ్యాడో భర్త. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న ఆమెను ఓ గొర్రెలకాపరి చూడడంతో ప్రాణాలతో బయటపడగలిగింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో జరిగిందీ ఘటన. సోనుర్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి శనివారం ఆమె ఏడుపు విని దగ్గరకు వెళ్లి చూసి నిర్ఘాంతపోయాడు.
- చెట్టుకు కట్టేసి పరారైన భర్త
ముంబై, జూలై 29 (నమస్తే తెలంగాణ): తనతో గొడవ పడిన భార్యను అడవికి తీసుకెళ్లి గొలుసుతో ఆమె కాళ్లను చెట్టుకు కట్టేసి పరారయ్యాడో భర్త. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న ఆమెను ఓ గొర్రెలకాపరి చూడడంతో ప్రాణాలతో బయటపడగలిగింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో జరిగిందీ ఘటన. సోనుర్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి శనివారం ఆమె ఏడుపు విని దగ్గరకు వెళ్లి చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి ప్రాథమిక చికిత్స అనంతరం దవాఖానకు తరలించారు. ఆమెను అమెరికాకు చెందిన లలిత కాయి కుమార్ ఎస్ (50)గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె తమిళనాడులో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఆమె తన సమస్యలను పేపరు మీద రాసి వైద్యులకు చెప్తున్నది. 40 రోజులుగా తనకు ఆహారం లేదని, చిన్నపాటి గొడవ తర్వాత భర్తే తనను అడవిలోకి తీసుకెళ్లి గొలుసుతో చెట్టుకు కట్టేసినట్టు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేదని, రెండ్రోజుల నుంచి ఆమె ఏమీ తీసుకోకపోవడంతో బలహీనంగా ఉందని పోలీసులు తెలిపారు. ఎన్ని రోజుల నుంచి ఆమెను చెట్టుకు కట్టేశారో తెలియదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

