Video: దేశ రాజధానిలో దారుణం.. దవాఖానలో చేర్చుకోకపోవడంతో రోడ్డుపైనే మహిళ ప్రసవం!!
దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ గర్భిణిని దవాఖానలో చేర్చుకునేందుకు సఫ్దర్జంగ్ హాస్పిటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో రాత్రంతా ఆమె దవాఖాన బయటే ఉండిపోయింది. పురిటినొప్పులు రావడంతో దవాఖాన అత్యవరసర విభాగం వెలుపల రోడ్డుపై ప్రసవించింది. దవాఖాన సిబ్బందిపై సదరు మహిళ బంధువులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ గర్భిణిని దవాఖానలో చేర్చుకునేందుకు సఫ్దర్జంగ్ హాస్పిటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో రాత్రంతా ఆమె దవాఖాన బయటే ఉండిపోయింది. పురిటినొప్పులు రావడంతో దవాఖాన అత్యవరసర విభాగం వెలుపల రోడ్డుపై ప్రసవించింది. దవాఖాన సిబ్బందిపై సదరు మహిళ బంధువులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల గర్భిణి సోమవారం ప్రసవం కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్కు వచ్చింది. అయితే, ఆమెకు దవాఖాన సిబ్బంది అడ్మిషన్ నిరాకరించారు. దీంతో ఆమె సోమవారం రాత్రంతా దవాఖాన బయటే ఉండిపోయింది. దవాఖాన వెలుపల రోడ్డుపై పురిటినొప్పులు రావడంతో కొంతమంది మహిళలు చీర అడ్డుగా పెట్టగా, నర్సులు ప్రసవం చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం మహిళ, శిశువు ఇద్దరూ దవాఖానలో చేరారని, క్షేమంగా ఉన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నైరుతి) మనోజ్ తెలిపారు. గైనకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యుడు వారికి చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై బాధిత వర్గంనుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేన్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, త్వరలోనే ప్రాథమిక నివేదికను అందజేస్తామని తెలిపారు. కాగా, ఈ ఘటనకు బాధ్యులపై చర్య తీసుకున్నారా? లేదా? అనే నివేదికను జూలై 25లోగా అందజేయాలని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ సదరు దవాఖానకు నోటీసు జారీ చేసింది.
देश की राजधानी दिल्ली के सफदरजंग अस्पताल में एक गर्भवती महिला ने सफदरजंग अस्पताल के बाहर एक नवजात शिशु को दिया जन्म इस दुर्व्यवहार को क्या कहे दिल्ली व केंद्र सरकार की लचारता कहे यह अस्पताल परिसर स्टाफ की प्रंशसा कहे ?@PMOIndia @ArvindKejriwal pic.twitter.com/smOyRs2KFZ
— Ajay kanojiya Hindustani {INC} (@ajayaicc2022) July 19, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

