Watch: స్కూటర్‌ను ఢీకొట్టిన కారు.. వంతెన పైనుంచి ఎగిరి పిల్లర్‌పై పడిన మహిళ
Woman Flung Off Noida Elevated Road | మహిళ డ్రైవ్ చేసిన స్కూటర్‌ను ఒక కారు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ వంతెన పైనుంచి ఎగిరి పిల్లర్‌పై పడింది. గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కాపాడేందుకు ఆ పిల్లర్ వద్దకు చేరుకున్నారు.
లక్నో: మహిళ డ్రైవ్ చేసిన స్కూటర్‌ను ఒక కారు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ వంతెన పైనుంచి ఎగిరి పిల్లర్‌పై పడింది. (Woman Flung Off Noida Elevated Road) గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కాపాడేందుకు ఆ పిల్లర్ వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా వారిని కిందకు చేర్చారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. శనివారం సెక్టార్ 25 సమీపంలో స్కూటీపై ఎలివేటెడ్ రోడ్లో వెళ్తున్న మహిళను కారు ఢీకొట్టింది. దీంతో ఆమె ఎగిరి ఆ వంతెన పిల్లర్‌పై పడింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అక్కడి నుంచి కదలలేని స్థితిలో ఉంది.
కాగా, పిల్లర్ పై భాగంలో పడి ఉన్న ఆ మహిళను కొందరు గమనించారు. సాహసం చేసిన ఇద్దరు వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఆమెను పైకి చేర్చలేక వారు పైకి రాలేక అక్కడ చిక్కుకుపోయారు. ఇది చూసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వారిని కిందకు దించారు. గాయపడిన మహిళను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆ మహిళ స్టేట్మెంట్ తీసుకుని ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. ఆమె స్కూటర్‌ను ఢీకొట్టిన కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాగా, మహిళ రెస్క్యూకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | Uttar Pradesh: A scooty-riding girl landed on the pillar of the elevated road near Noida Sector 25 under Sector 20 PS area, after she was hit by an unidentified vehicle. Two men are attempting to rescue her. More details awaited. pic.twitter.com/IsABJQrH1t
— ANI (@ANI) September 21, 2024
#WATCH | Uttar Pradesh: The scooty-riding girl who landed on the pillar base of the elevated road near Noida Sector 25, after she was hit by an unidentified vehicle, has now been rescued. The two men who were attempting to rescue her have also been rescued. All three of them have… pic.twitter.com/ZpEOwWSHE9
— ANI (@ANI) September 21, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

