నాన్ వెజ్ పిజ్జా డెలివరీ.. కోటి పరిహారం కోరిన మహిళ

లక్నో: నాన్ వెజ్ పిజ్జా డెలివరీ చేసినందుకు ఒక మహిళ ఆ సంస్థకు వ్యతిరేకంగా వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. పరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్‌కు చెందిన దీపాలి త్యాగి 2019 మార్చి 21న అమెరికాకు చెందిన పిజ్జా డెలివరీ సంస్థ నుంచి వెజ్ పిజ్జాలకు ఆర్డర్ చేశారు. ఆ రోజు హోలీ కావడంతో ఆమెతోపాటు పిల్లలు రంగులతో ఆడటంతో అలిసిపోయి బాగా ఆకలితో ఉన్నారు.
అయితే ఆ సంస్థ పేర్కొన్న సమయం కన్నా 30 నిమిషాలు ఆలస్యంగా పిజ్జాలను డెలివరీ చేసింది. బాగా ఆకలితో ఉండటంతో పిజ్జాలు తినేందుకు దీపాలి త్యాగి కుటుంబం సిద్ధమైంది. ఒక పిజ్జాను తిన్న ఆమె అది నాన్ వెజ్ అని గ్రహించి కంగుతిన్నారు. పూర్తి శాఖాహారి అయిన తాము పుట్టగొడుగుల పిజ్జాకు ఆర్డర్ చేయగా మీట్ పిజ్జాను డెలివరీ చేశారని ఆరోపించారు. దీనిపై కస్టమర్ కేర్‌కు కాల్ చేయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మండిపడ్డారు.
కాగా, ఐదు రోజుల తర్వాత సంస్థ మేనేజర్ ఒకరు ఫోన్ చేసి తమ ఔట్లెట్లో ఆ కుటుంబానికి ఉచితంగా పిజ్జాలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అయితే వారి నిరక్ష్యం వల్ల తమ మతాచారానికి భంగం కలగడంతోపాటు శాశ్వత మానసిక వేదనకు గురి చేసిందని త్యాగి ఆవేదన వ్యక్తం చేశారు. చంపిన జంతు మాంసాన్ని తిన్న పాపానికి ప్రాయశ్చిత్తంగా దీర్ఘకాలంపాటు అనేక పూజలు, యాగాలు, ఆచారాలు అనుసరించాల్సి ఉంటుందని, దీనికి లక్షలు ఖర్చు అవుతుందని ఆ మేనేజర్‌తో చెప్పారు.
అయితే డబ్బు వ్యవహారాలకు తనకు సంబంధం లేదని ఆ మేనేజర్ తెలిపారు. దీంతో దీపాలి త్యాగి ఆ సంస్థకు వ్యతిరేకంగా వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఆ సంస్థ నిర్లక్ష్యం వల్ల తమ మతాచారానికి భంగం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ మత విశ్వాసం ప్రకారం ఏదైనా జంతువును చంపి దాని మాంసం తినడం పాపమని, ఇది జీవితాంతం మానసిక వేదనకు గురి చేయడంతోపాటు తన ఆత్మను గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ సంస్థ తమ మత విశ్వాసాన్ని నాశనం చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. మానసిక వేధింపులు, పాప పరిహారం, ప్రాయశ్చిత్తం కోసం ఆర్థిక ఇబ్బందులకు గురిచేసిన ఆ సంస్థ పరిహారంగా రూ.కోటి చెల్లించేలా ఆదేశించాలన కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల కోర్టు ఆ మహిళ ఫిర్యాదుపై సమాధానం దాఖలు చేయాలని ఆ పిజ్జా సంస్థను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

