Watch: మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ నడిచి వెళ్తున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Falls | ఒక మహిళ మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నది. అయితే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కొనిపోయారు. ఊహించని ఈ సంఘటనతో ఆ మహిళ ఎగిరి రోడ్డుపై పడింది.
భోపాల్: ఒక మహిళ మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నది. అయితే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కొనిపోయారు. ఊహించని ఈ సంఘటనతో ఆ మహిళ ఎగిరి రోడ్డుపై పడింది (Woman Falls). మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది.
ఆదివారం సాయంత్రం 4 గంటలకు తుకోగంజ్ ప్రాంతంలోని రోడ్డుపై ఒక మహిళ వెళ్తున్నది. ఆమె మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు పక్కగా నడుస్తున్నది. ఇంతలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మహిళ సమీపానికి వచ్చారు. బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తి ఆ మహిళ చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడు. అయితే మొబైల్ ఫోన్‌ను ఆమె గట్టిగా పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎగిరి రోడ్డుపై బోర్లా పడింది.
కాగా, ఆ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. తేరుకున్న వెంటనే స్థానిక పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ దొంగలను పోలీసులు గుర్తించారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారిని వెంబడించగా పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రోడ్డుపై పడ్డారు. ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఆ దొంగలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Indore – Woman Falls Face-First On Road As #Bikers Snatch #phone #Viralvideo #MadhyaPradesh #police #news #crime
Subscribe to our YouTube page: https://t.co/bP10gHsrFh pic.twitter.com/SnyDosEpMn
— UnMuteINDIA (@Letsunmuteindia) July 3, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bikers
- MP’s Indore
- phone
- snatch
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

