Police gangrape woman | ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళ.. సామూహిక లైంగిక దాడికి పాల్పడి మరో వ్యక్తికి అమ్మేసిన పోలీసులు
Police gangrape woman | ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళపై కొందరు పోలీసులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Police gangrape woman ) ఆ తర్వాత మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు.
చండీగఢ్: ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళపై కొందరు పోలీసులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Police gangrape woman ) ఆ తర్వాత మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు. ఈ నేపథ్యంలో అతడు, మరో వ్యక్తి కూడా ఆ మహిళపై అత్యాచారం చేశారు. బీజేపీ పాలిత హర్యానాలోని పల్వాల్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. జూలై 23న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఒక మహిళ హసన్పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ఎస్ఐ శివ చరణ్‌ను ఆమె కలిసింది.
కాగా, ఆ మహిళ నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు ఎస్ఐ శివ చరణ్ నిరాకరించాడు. పైగా సహచర పోలీస్తో కలిసి సమీపంలోని పొలం వద్దకు వెళ్లాలని ఆమెను బలవంతం చేశాడు. అక్కడ వేచి ఉన్న నిరంజన్, భీమా, ఆ పోలీస్ కలిసి ఆ మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిని వీడియో తీసి ఆమెను బెదిరించారు. అనంతరం ఆ మహిళను పల్వాల్‌లోని శాంతి అనే మరో మహిళ ఇంటికి తీసుకెళ్లారు. ఆ రాత్రి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు బాధిత మహిళను మూడు రోజులపాటు ఆ ఇంట్లో బంధించారు. ఆ తర్వాత బిజేంద్ర అనే వ్యక్తికి ఆమెను విక్రయించారు. అతడు తన బావ గజేంద్రతో కలిసి ఎస్ఐ శివ చరణ్ సమక్షంలో ఆ మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే నిందితుల్లో ఒకరి మొబైల్ ఫోన్ నుంచి ఆ మహిళ రహస్యంగా పోలీసులకు ఫోన్ చేసింది. జరిగిన దారుణం గురించి చెప్పింది. తనను కాపాడమని వేడుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించి ఆ మహిళను రక్షించారు. ఎస్ఐ శివ చరణ్‌తో సహా ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

