Aryan Khan: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో 25 కోట్ల లంచం డిమాండ్ చేశారు: సీబీఐ రిపోర్టు
Aryan Khan: ఆర్యన్ ఖాన్‌ను విడిచిపెట్టేందుకు షారూక్ ఫ్యామిలీని ఎన్సీబీ ఆఫీసర్ 25 కోట్ల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సీబీఐ ఇవాళ తన ఛార్జిషీట్లో మాజీ ఆఫీసర్ సమీర్ వాంఖడేపై కేసు బుక్ చేసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న కేపీ గోస్వామి అనే వ్యక్తి ఆ డబ్బులు లాగే ప్రయత్నం చేసినట్లు సీబీఐ తెలిపింది.
ముంబై: డ్రగ్స్ కేసులో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇరుక్కున్న విషయం తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ ఫ్యామిలీ నుంచి కేపీ గోసావి అనే సాక్షి సుమారు 25 కోట్లు డిమాండ్ చేసినట్లు సీబీఐ అధికారులు తమ విచారణలో తేల్చారు. క్రూయిజ్‌లో డ్రగ్స్‌తో దొరికిన ఆర్యన్ ఖాన్‌పై కేసు పెట్టకుండా ఉండేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ సమీర్ వాంఖడే 25 కోట్ల లంచం డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ ఇటీవల ఆ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
2021, అక్టోబర్ 2వ తేదీన కార్డెలియా క్రూయిజ్ షిప్లో ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఆ క్రూయిజ్‌లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు ఆరోపణలు రావడంతో దానిపై నార్కోటిక్స్ పోలీసులు దాడి చేశారు. అయితే ఈ కేసులో సమీర్ వాంఖడేపై ఆరోపణలు రావడంతో శుక్రవారం రోజున సీబీఐ సుమారు 29 ప్రాంతాల్లో సోదాలు చేసింది. ముంబై, ఢిల్లీ, రాంచీ, లక్నో, గౌహతి, చెన్నై నగరాల్లో తనిఖీలు జరిగాయి.
2008 ఐఆర్ఎస్ ఆఫీసర్ వాంఖడేతో పాటు మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్సీబీ సూపరింటెండెంట్ విశ్వ విజయ్ సింగ్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అశిశ్ రంజన్, ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు కేపీ గోసావి, సాన్విల్ డిసౌజా ఉన్నారు. 120-బీ ఐపీసీ, 388 ఐపీసీ కింద కేసులు బుక్ చేశారు. ఎన్సీబీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అవినీతి కూడా కూడా నమోదు అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Aryan Khan
- cbi
- Drugs Case
- extortion
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

