అబ్బాయికి బట్టతల ఉందని.. పెండ్లి మధ్యలో వెళ్లిపోయిన వధువు
పెండ్లి కొడుకు నచ్చకపోయినా వధువు మౌనంగా తలవంచుకుని తాళి కట్టించుకునే రోజులు పోయాయి. అబ్బాయి నచ్చకపోతే కరాఖండీగా చెప్పేస్తున్నారు ఈతరం అమ్మాయిలు
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘటన
ఉన్నావ్ (యూపీ), మే 22: పెండ్లి కొడుకు నచ్చకపోయినా వధువు మౌనంగా తలవంచుకుని తాళి కట్టించుకునే రోజులు పోయాయి. అబ్బాయి నచ్చకపోతే కరాఖండీగా చెప్పేస్తున్నారు ఈతరం అమ్మాయిలు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ వధువు కూడా ఇలాగే అబ్బాయికి బట్టతల ఉందని పెండ్లి మధ్యలో నుంచి వెళ్లిపోయింది. అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబసభ్యుల వద్ద దాచిపెట్టాడు. అయితే పెండ్లి మండపానికి వస్తుండగా, కండ్లు తిరగడంతో అబ్బాయి కింద పడ్డాడు. దీంతో తలకు ఉన్న విగ్గు ఊడిపోయింది.
ఇది అక్కడున్న వారంతా చూసి అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పెండ్లి కూతురు బట్టతల ఉన్న వ్యక్తితో పెండ్లి వద్దంటే వద్దని భీష్మించుకుంది. చివరికి పంచాయితీ పోలీసుల దగ్గరికి కూడా వెళ్లింది. అయినా కూడా పెండ్లికి ససేమిరా అన్నది. పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరుపగా, పెండ్లి కోసం అమ్మాయి తండ్రి ఖర్చు చేసిన రూ.5.6 లక్షలు తిరిగి ఇవ్వాలని తీర్మానం చేయడంతో అబ్బాయి తరఫు వారు అంగీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

