Sonam Wangchuk | ఆ హత్యలపై దర్యాప్తు జరిపించకపోతే జైల్లోనే ఉంటా : సోనమ్ వాంగ్చుక్
Sonam Wangchuk | లఢఖ్ (Ladakh) కు రాష్ట్రహోదా (State hood) కోసం డిమాండ్ చేస్తూ ఇటీవల లేహ్ ప్రాంతంలో జనం నిరసనలకు దిగగా అల్లర్లు చెలరేగాయి. ఆ అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 90 మందికిపైగా గాయపడ్డారు.
Sonam Wangchuk : లఢఖ్ (Ladakh) కు రాష్ట్రహోదా (State hood) కోసం డిమాండ్ చేస్తూ ఇటీవల లేహ్ ప్రాంతంలో జనం నిరసనలకు దిగగా అల్లర్లు చెలరేగాయి. ఆ అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 90 మందికిపైగా గాయపడ్డారు. దాంతో లఢఖ్ ఉద్యమ నేత సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk) ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయన జైలు నుంచి ఓ సందేశం పంపారు.
లఢఖ్ ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై స్వతంత్య్ర దర్యాప్తు జరిపించాలని, లేదంటే తాను జైల్లోనే ఉండిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని వాంగ్చుక్ తన సందేశంలో హెచ్చరించారు. కాగా, వాంగ్చుక్ ప్రస్తుతం జోధ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. సోదరుడు కాత్సేతాన్ డోర్జే లేతో పాటు న్యాయవాది ముస్తఫా హాజీలు ఆయనను కలిసిన సందర్భంగా ఈ సందేశాన్ని పంపారు.
తాను శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నానని, తన కోసం ప్రార్థిస్తున్న వారికి ధన్యవాదాలు అని తన సందేశంలో వాంగ్చుక్ పేర్కొన్నారు. ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. నలుగురి హత్యలపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
లేదంటే తాను జైలులోనే ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. లఢఖ్కు రాష్ట్రహోదా కోసం ప్రజలు, లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ), కార్గిల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఏడీఏ) చేస్తున్న డిమాండ్లకు మద్దతిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి, ఐక్యతను కాపాడుకోవాలన్నారు. అహింసా మార్గంలోనే మన పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగించాలని ప్రజలకు సూచించారు.
కాగా సోనమ్ వాంగ్చుక్ పిలుపుతోనే లేహ్లో ఆందోళనలు జరిగాయని ఆరోపించిన కేంద్రం.. జాతీయ భద్రతాచట్టం కింద ఆయనను అరెస్ట్ చేయించింది. ఈ చట్టం కింద అరెస్టయిన వ్యక్తిని విచారణ చేయకుండా 12 నెలలపాటు నిర్బంధించేందుకు చట్టం అనుమతిస్తుంది. ఈ క్రమంలోనే తన భర్తను విడుదల చేయాలంటూ వాంగ్చుక్ భార్య గీతాంజలి జే ఆంగ్మో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

