Jim Corbett | జిమ్ కార్బెట్ కాదు రామ్‌గంగా.. నేషనల్ పార్క్ పేరు మారుస్తామన్న మంత్రి
ఉత్తరాఖండ్‌లో ఉన్న ప్రముఖ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్( Jim Corbett ) పేరును రామ్‌గంగా మార్చే అవకాశం ఉన్నదని ఈ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ బుధవారం వెల్లడించారు.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఉన్న ప్రముఖ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్( Jim Corbett ) పేరును రామ్‌గంగా మార్చే అవకాశం ఉన్నదని ఈ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ బుధవారం వెల్లడించారు. ఈ నెల 3న ఈ నేషనల్ పార్క్‌ను సందర్శించిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే.. జిమ్ కార్బెట్ పేరును రామ్గంగాగా మారుస్తామని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఇక రామ్‌నగర్‌లో ఉన్న ధేలా రెస్క్యూ సెంటర్లో టైగర్ సఫారీని ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తయిందని కూడా మంత్రి అశ్విని కుమార్ చెప్పారు. ఇది 1936లో హేలీ నేషనల్ పార్క్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌గా మారిన ఇందులో 1973లో తొలిసారి ప్రాజెక్ట్ టైగర్ మొదలైంది. ఇది 520 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

