Sadhguru Jaggi Vasudev: మహిళల్ని ఎందుకు సన్యాసినులుగా మారుస్తున్నారు.. సద్గురు జగ్జీ వాసుదేవ్‌ను ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు
Sadhguru Jaggi Vasudev: తమ కూతుళ్ల బ్రెయిన్‌వాష్ చేసి, వాళ్లు ఈషా యోగా సెంటర్లోనే ఉండేటట్లు చేశారని సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై ఓ ప్రొఫెసర్ కేసు దాఖలు చేశారు. ఆడపిల్లలను సన్యాసినులుగా మార్చేస్తున్నారని ఆరోపించారు.
చెన్నై: ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీ వాసుదేవ్(Sadhguru Jaggi Vasudev)ను మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. మహిళలను ఎందుకు సన్యాసినులుగా మారేలా ప్రేరేపిస్తున్నారని హైకోర్టు అడిగింది. ఓ కేసులో కోర్టు ఆ ప్రశ్న వేసింది. తన స్వంత కూతురి పెళ్లి చేసిన సద్గురు, ఎందుకు ఇతర అమ్మాయిలను సన్యాసం వైపు మళ్లిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియం, వీ శివజ్ఞానంతో కూడిన ధర్మాసనం ఈ ప్రశ్నలు వేసింది. తన ఇద్దరు కూతుళ్లను సద్గురు బ్రెయిన్‌వాష్ చేశారని, వాళ్లు పర్మనెంట్‌గా ఈషా యోగా సెంటర్లోనే ఉంటున్నారని ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీపై కేసు ఫైల్ చేశారు.
కోయంబత్తూరులోని తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ ఆ కేసు ఫైల్ చేశారు. 42, 39 ఏళ్లు ఉన్న ఇద్దరు మహిళలు ఆ కేసులో ఇవాళ కోర్టు ముందు హాజరయ్యారు. అయితే తమ ఇష్ట ప్రకారమే ఈషా ఫౌండేషన్‌లో ఉంటున్నట్లు చెప్పారు. తమను ఎవరూ బంధించలేదని చెప్పారు. కూతుళ్లు వదిలి వెళ్లడం వల్ల తమ జీవితం దుర్భరమైనట్లు ఆ పేరెంట్స్ కోర్టుకు వెల్లడించారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టాలని జడ్జీ సూచించారు.
ఈషా ఫౌండేషన్‌తో లింకున్న అన్ని కేసులను లిస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. తన కూతురుకు పెళ్లి చేసి, జీవితంలో సెటిలయ్యేలా చేశారని, కానీ ఇతరుల కూతుళ్లను మాత్రం సన్యాసుల్లా జీవించేలా ప్రేరేపిస్తున్న సద్గురు ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకోవాలని ఉందని జస్టిస్ శివజ్ఞానం తెలిపారు. స్వచ్ఛందంగా ఉండేందుకు మహిళలు నిర్ణయించినట్లు ఈషా ఫౌండేషన్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

