women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
women cops detain Dipke | జంతర్‌మంతర్ వద్ద నిరసనల కోసం విమానంలో ముంబై నుంచి ఢిల్లీ చేరిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ఆయన బృందాన్ని మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మగ పోలీసులకు బదులుగా మహిళా పోలీసులను మోహరించడం ఢిల్లీ పోలీసుల ప్లాన్‌గా తెలుస్తున్నది.
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద నిరసనల కోసం విమానంలో ముంబై నుంచి ఢిల్లీ చేరిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ఆయన బృందాన్ని మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మగ పోలీసులకు బదులుగా మహిళా పోలీసులను మోహరించడం ఢిల్లీ పోలీసుల ప్లాన్‌గా తెలుస్తున్నది. (women cops detain Dipke) శనివారం సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే నాటకీయ పరిణామాలు జరిగాయి. అక్కడ మోహరించిన మహిళా పోలీస్ అధికారులు వెంటనే ఆ విమానంలోకి ప్రవేశించారు. అభిజీత్ దీప్కే, ఆయన బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని అజ్ఞాత ప్రాంతానికి తరలించారు.
కాగా, అభిజిత్ దీప్కే, ఆయన బృందాన్ని అదుపులోకి తీసుకోవడానికి మహిళా పోలీస్ అధికారులను పంపడం ఢిల్లీ పోలీసుల ప్లాన్‌లో భాగంగా జరిగిందా? అన్న చర్చకు దారి తీసింది. ఒకవేళ పురుష పోలీస్ అధికారులను రంగంలోకి దించితే ఘర్షణలకు దారితీయవచ్చని ఢిల్లీ పోలీసులు ముందుగానే ఊహించి ఉంటారని తెలుస్తున్నది. అలాగే విమానంలో నడిచే ప్రాంతం చాలా ఇరుకుగా ఉంటుంది. ప్రయాణికులు కదలడానికి చాలా తక్కువ స్థలం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక చిన్న తోపులాట కూడా త్వరగా పెద్ద ఘర్షణగా మారే అవకాశమున్నది.
మరోవైపు నీట్ పేపర్ లీక్ వివాదంపై సీజేపీ చేపట్టిన తొలి భారీ నిరసన సందర్భంగా జూలై 20న తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. పురుష పోలీస్ అధికారులు యువతులను కొట్టడంతో పాటు వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సీజేపీ ఆరోపించింది. ఆ పోలీస్ అధికారులపై కేసుల నమోదుతో పాటు వారిపై చర్యలకు డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో ఈసారి ఢిల్లీ పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. అందుకే సీజేపీ నాయకత్వ బృందం అరెస్ట్ కోసం మహిళా పోలీసులకు ప్రాధాన్యత ఇచ్చారు. విమానంలో ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదాన్ని నివారించే ఉద్దేశంతోనే ఢిల్లీ పోలీసులు మహిళా అధికారులను రంగంలోకి దించారు. దీంతో చిన్న వాగ్వాదాలు మినహా ఎలాంటి ప్రతిఘటనలు ఎదురుకాలేదు. ఎలాంటి గందరగోళం లేకుండానే అభిజిత్ దీప్కే, ఇతర సీజేపీ నాయకులను మహిళా పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఢిల్లీ పోలీసుల ముందస్తు ప్రణాళికలో లేని ఈ అనూహ్య చర్య, వ్యూహం ఉద్దేశపూర్వకంగా తీసుకున్నదా? లేదా అన్నది తెలియలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

