జీర్ణకోశాన్ని తీవ్రంగా దెబ్బతీసిన వైట్‌ఫంగస్.. ఢిల్లీలో తొలి కేసు నమోదు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వైట్ ఫంగస్ తొలి కేసు నమోదు అయ్యింది. సర్ గంగా రామ్ హాస్పిటల్లో కోవిడ్ రోగిలో ఈ కేసు రిపోర్ట్ అయ్యింది. వైట్ ఫంగస్ వల్ల ఆ రోగి జీర్ణకోశంలో అనేక చోట్ల చిన్న చిన్న రంధ్రాలు పడినట్లు డాక్టర్లు గుర్తించారు. అన్న వాహికలో, చిన్న పేగు, పెద్ద పేగులో సూక్ష్మ స్థాయిలో రంధ్రాలను గుర్తించినట్లు తెలిపారు. లివర్, గ్యాస్ట్రోఎంటరాలజీ, ప్యాంక్రియాటిక్ ఒబిలరీ సైన్సెస్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అనిల్ అరోరా ఈ విషయాన్ని చెప్పారు. మే 13వ తేదీన గంగారామ్ హాస్పిటల్లో 49 ఏళ్ల మహిళ అడ్మిట్ అయ్యింది. తీవ్రమైన కడుపు నొప్పితో ఆమెకు హాస్పిటల్‌కు వచ్చింది. వాంతులు, అజీర్త సమస్యలు కూడా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స కూడా జరిగింది. నాలుగు వారాల క్రితమే ఆమెకు కీమోథెరపీ కూడా చేశారు. అయితే ఆమె ఉదరాన్ని సీటీ స్కాన్ చేయడంతో.. కడుపులో వాయువు, తెల్లటి ద్రవాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె పేగుల్లో రంధ్రాలు పడినట్లు అంచనాకు వచ్చారు.
వైట్ ఫంగస్ ఆనవాళ్లను పసికట్టిన డాక్టర్లు తక్షణమే ఆమె కడుపులో ఉన్న జీర్ణరస ద్రవాలను ఓ పైపు ద్వారా బయటకు తీశారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ సమిరన్ నండీ నేతృత్వంలోని డాక్టర్ల బృందం ఆ సర్జరీ చేసింది. అన్నవాహిక చివరి భాగంలో రంధ్రం పడినట్లు డాక్టర్లు గుర్తించారు. చిన్నపేగులో గ్యాంగ్రిన్ డెవలప్ అయినట్లు కూడా డాక్టర్లు తెలిపారు. అయితే రంధ్రాలను సర్జరీతో మూసివేశారు. గ్యాంగ్రిన్ పుండు సర్జరీ సుమారు నాలుగు గంటల పాటు చేశారు. ఆ తర్వాత బయాప్సీ కోసం కొంత పేగు భాగాన్ని పరీక్షకు పంపారు. అయితే వైట్ ఫంగస్ వల్ల పేగు పొరల్లో చీలకలు వచ్చినట్లు బయాప్సీ రిపోర్ట్ పేర్కొన్నది. యాంటీ ఫంగల్ మందులు ఇచ్చిన తర్వాత ఆమె కోలుకుంటున్నట్లు డాక్టర్ ఆరోరా తెలిపారు.
కానీ మళ్లీ అయిదు రోజుల తర్వాత ఆమెకు మరో సర్జరీ చేశారు. అనస్టోమోటిక్ ప్రాంతం వద్ద లీకేజీని మూసివేశారు. ఆ సర్జరీ నుంచి కూడా ఆమె కోలుకుంటున్నట్లు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శాఖ డాక్టర్ అరబిందో తెలిపారు. డయాబెటిక్ కోవిడ్ రోగుల్లో బ్లాక్ ఫంగస్‌తో సమస్యలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వైట్ ఫంగస్ వల్ల మాత్రం జీర్ణకోశంలో అనేక ప్రాంతాల్లో పర్ఫోరేషన్స్ అవుతున్నట్లు డాక్టర్ ఆరోరా వెల్లడించారు. క్యాండిడా అనే ఫంగస్ వల్ల సాధారణంగా జీర్ణకోశం మెరుగ్గా పనిచేస్తుందని, కానీ సదరు పేషెంట్ కీమోథెరపీ లాంటి చికిత్సలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనపడినట్లు డాక్టర్ చెప్పారు. డయాబెటిక్ రోగుల్లో, అతిగా స్టెరాయిడ్స్ తీసుకువారిలో, కీమోథెరపీ ఉన్నవారిలో… వైట్ ఫంగస్ పేగుల్లోంచి చొచ్చుకుపోయి శరీర భాగాల్లోకి ప్రవేశిస్తుందని డాక్టర్లు చెప్పారు. అల్సర్లు, బ్లీడింగ్, గ్యాంగ్రీన్ వల్ల కూడా జీర్ణకోశంలో వైట్ ఫంగస్ తీవ్ర నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

