Woman Falls Off Terrace | మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ.. టెర్రస్ పైనుంచి పడి యువతి మృతి
Woman Falls Off Terrace | ఒక యువతి మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఇంటి టెర్రస్ పైనుంచి కింద పడింది. రక్తం మడుగుల్లో ఉన్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ముంబై: ఒక యువతి మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఇంటి టెర్రస్ పైనుంచి కింద పడింది. (Woman Falls Off Terrace) రక్తం మడుగుల్లో ఉన్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 18 ఏళ్ల మాన్సీ అబేద్వార్ 12వ తరగతి పాస్ అయ్యింది. కుటుంబంతో కలిసి గోపాల్‌నగర్ బస్టాప్ సమీపంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాన్సీ ఇంటి టెర్రస్‌పైకి వెళ్లింది. చిన్నగోడపై కూర్చొన్న ఆమె మొబైల్ ఫోన్లో ఫ్రెండ్‌తో మాట్లాడటంలో బిజీ అయ్యింది. అయితే అదుపుతప్పిన ఆమె టెర్రస్ పై నుంచి కిందపడింది.
కాగా, మాన్సీ అరుపులు విన్న తల్లి, సోదరుడు వెంటనే బయటకు వచ్చి చూశారు. రక్తం మడుగుల్లో పడి ఉన్న ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

