Liquor consumption | దేశంలో అత్యధిక శాతం మంది మద్యం సేవించే రాష్ట్రం ఏదో తెలుసా..?
Liquor consumption | భారతదేశంలో జాతీయ కుటుంబ సంక్షేమంపై కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వే చేయించింది. ఈ సర్వేలో మద్యం వినియోగానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మద్యం వినియోగంలో నగరాలకు, పట్టణాలకు మధ్య.. పురుషులకు, స్త్రీలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ఈ సర్వే వెల్లడించింది.
Liquor consumption : భారతదేశంలో జాతీయ కుటుంబ సంక్షేమంపై కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వే చేయించింది. ఈ సర్వేలో మద్యం వినియోగానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మద్యం వినియోగంలో నగరాలకు, పట్టణాలకు మధ్య.. పురుషులకు, స్త్రీలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ఈ సర్వే వెల్లడించింది. దేశంలో నగరాల్లో కంటే గ్రామాల్లోనే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని సర్వే స్పష్టం చేసింది.
ప్రస్తుతం బీహార్, గుజరాత్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం అమలులో ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ మద్యానికి స్వస్తి పలుకాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ కుటుంబ సంక్షేమంపై కేంద్రం చేయించిన సర్వే పలు విషయాలను వెల్లడించింది. మద్యం సేవించేవారిని పురుషులు, మహిళలు అనే రెండు గ్రూపులుగా విభజించింది.
ఈ సర్వేలో తేలిన ఆసక్తికర విషయం ఏమిటంటే.. దేశంలో నగరాల్లో నివసించే వారి కంటే గ్రామాల్లో నివసించే వారు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. దేశంలో 15 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు 18.7%, 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న స్త్రీలలో 1.3% మంది మద్యపానం చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలుగా విభజించినట్లయితే.. గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలలో 1.6% మంది, పట్టణ ప్రాంత స్త్రీలలో 0.6% మంది మద్యం సేవిస్తున్నారు.
పురుషుల విషయానికొస్తే పట్టణ ప్రాంతాల్లో 16.5% మంది, గ్రామీణ ప్రాంతాల్లో 19.9% మంది మద్యం సేవిస్తున్నారు. ఇక రాష్ట్రాల వారీగా విభజించబడినప్పుడు దేశంలో అత్యధిక సంఖ్యలో పురుషులు తాగుబోతులుగా ఉన్న రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 52.6% మంది పురుషులు మద్యం ప్రియులు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 43.4% మంది పురుషులు మద్యాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఆ తర్వాత స్థానాల్లో వరుసగా సిక్కిం (39.9%), అండమాన్ (38.8%) మూడో స్థానంలో ఉన్నాయి. తర్వాత స్థానాల్లో వరుసగా మణిపూర్ (37.2%), గోవా (36.8%), ఛత్తీస్‌గఢ్ (34.7%) ఉన్నాయి. అతి తక్కువ మద్యం సేవించే రాష్ట్రాల జాబితాలో లక్షదీప్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 0.4 శాతం మంది పురుషులు మద్యపానం చేస్తున్నారు. తర్వాత స్థానాల్లో గుజరాత్ (5.8%), జమ్మూ & కశ్మీర్ (8.7%), రాజస్థాన్ (11%), మహారాష్ట్ర (13.9%), ఉత్తరప్రదేశ్ (14.5%) ఉన్నాయి.
ఇక మహిళల పరంగా చూస్తే.. అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్‌లో 24.2% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. తర్వాత స్థానాల్లో సిక్కిం (16.2%), అస్సాం (7.3%), తెలంగాణ (6.7%), జార్ఖండ్ (5.7%), అండమాన్ (5%), ఛత్తీస్‌గఢ్ (4.9%) ఉన్నాయి. దేశంలోని ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, ఒడిశాలలో మద్యపానం ఎక్కువగా ఉంది. జాతీయ కుటుంబ సంక్షేమ సర్వేను ప్రతి మూడేళ్లకోసారి నిర్వహిస్తారు. మార్చి 2022లో ప్రచురితమైన ఈ అధ్యయనం 2019 నుంచి 2021 వరకు మూడేళ్ల డేటాను తెలియజేస్తున్నది. తదుపరి అధ్యయనం 2026లో ప్రచురితం కానుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

