Mallikarjun Kharge | ప్రధాని మోదీ జపాన్‌కు వెళ్లినప్పుడల్లా దేశంలో నోట్ల రద్దే: మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను వాపస్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను వాపస్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడు జపాన్ పర్యటనకు వెళ్లినా అప్పుడు దేశంలో కరెన్సీపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటన వెలువడుతున్నదని ఎద్దేవా చేశారు. గతంలో ప్రధాని జపాన్ పర్యటనలో ఉన్నప్పుడే దేశంలో రూ.1000 నోటును రద్దు చేశారని ఖర్గే గుర్తుచేశారు.
ఇప్పుడు ప్రధాని మరోసారి జపాన్‌కు వెళ్లాడని, ఈ క్రమంలోనే రూ.2000 నోటును వాపస్ తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిందని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇవాళ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మీడియా తనను చుట్టుముట్టి రూ.2000 నోట్ గురించి ప్రశ్నించగా ఖర్గే పైవిధంగా స్పందించారు.
దేశంలో రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం సాయంత్రం ఆర్బీఐ ప్రకటించింది. ఇకపై బ్యాంకుల నుంచి రూ.2000 నోట్లను బయటికి సర్క్యులేట్ చేయవద్దని ఆదేశించింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు రూ.2000 నోట్లు చెలామణిలోనే ఉంటాయని కేంద్ర బ్యాంకు స్పష్టంచేసింది. ఈ లోగా రూ.2000 నోట్లు కలిగి ఉన్న వాళ్లు రోజుకు 10 నోట్లకు మించకుండా మార్చుకునే వెసులుబాటు కల్పించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

