Bengal Govt | బార్డర్ ఫెన్సింగ్ కోసం బీఎస్ఎఫ్కు భూమి బదిలీ.. ఆమోదం తెలిపిన బెంగాల్ ప్రభుత్వం
Bengal Govt | భారత్-బంగ్లాదేశ్ (India-Bangladesh) సరిహద్దుకు కంచె వేయడానికి అవసరమైన భూమిని సరిహద్దు భద్రతా దళం (BSF) కు బదిలీ చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రకటించారు. అక్రమ చొరబాట్ల సమస్యను పరిష్కరించేందుకు 45 రోజులలోపు ఆ భూమిని కేంద్ర హోంశాఖకు అప్పగిస్తామని చెప్పారు.
Bengal Govt : భారత్-బంగ్లాదేశ్ (India-Bangladesh) సరిహద్దుకు కంచె వేయడానికి అవసరమైన భూమిని సరిహద్దు భద్రతా దళం (BSF) కు బదిలీ చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రకటించారు. అక్రమ చొరబాట్ల సమస్యను పరిష్కరించేందుకు 45 రోజులలోపు ఆ భూమిని కేంద్ర హోంశాఖకు అప్పగిస్తామని చెప్పారు. హౌరాలోని నబన్నాలో సమావేశమైన బెంగాల్ నూతన క్యాబినెట్ (Bengal Cabinet) అందుకు అమోదం తెలిపినట్లు వెల్లడించారు. సమావేశం అనంతరం సీఎం సువేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ముఖ్య తీర్మానాల్లో బీఎస్ఎఫ్కు భూమిని బదిలీ చేయాలనేది ఒకటని చెప్పారు.
‘ఇవాళ మా తొలి మంత్రివర్గ సమావేశంలోనే బీఎస్ఎఫ్కు భూమిని బదిలీ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ఈ భూమి బదిలీ ప్రక్రియ ఇవాళ ప్రారంభమవుతుంది. వచ్చే 45 రోజుల్లో దీన్ని కేంద్రహోంశాఖకు బదిలీ చేస్తాం. బదిలీ పూర్తయిన తర్వాత బీఎస్ఎఫ్ సరిహద్దు కంచె నిర్మాణం చేస్తుంది. తద్వారా ఇన్నాళ్లుగా కొనసాగుతున్న అక్రమ చొరబాట్ల సమస్య పరిష్కారమవుతుంది’ అని సువేందు అధికారి ప్రకటించారు. సీనియర్ అధికారులతో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశం.. డబుల్ ఇంజిన్ సర్కారు పాలనా ప్రాధాన్యతలు, అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి సారించిందని తెలిపారు.
తమ తొలి క్యాబినెట్ సమావేశంలో ఆరు నిర్ణయాలు తీసుకున్నామని సువేందు అధికారి చెప్పారు. ఆయుష్మాన్ భారత్, జన ఆరోగ్య యోజన సహా కేంద్ర సంక్షేమ పథకాలు ఇక నుంచి పశ్చిమ బెంగాల్లోనూ అమలవుతాయని సువేందు చెప్పారు. మా రాజకీయ పోరాటంలో ప్రత్యర్థుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 321 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలు కోరుకుంటే ఆ హత్య కేసులతో ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభం చేయిస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడంలో సహకరించిన ఓటర్లు, ఎన్నికల సంఘం, పోలీసు సిబ్బంది, కేంద్ర బలగాలు, రాజకీయ పార్టీలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

