CM Mamata Banerjee: సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ ట్రిప్ వాయిదా
CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ .. ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నారు. గురువారం ఆమె ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నది. నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలు బహిష్కరించిన నేపథ్యంలో.. దీదీ ఆ నిర్ణయం తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee).. ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నారు. గురువారం ఆమె ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నది. జూలై 27వ తేదీన నీతి ఆయోగ్ మీటింగ్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఒక రోజు పాటు ఆమె తన పర్యటన వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలు బహిష్కరించిన నేపథ్యంలో.. దీదీ ఆ నిర్ణయం తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి చూపినట్లు సీఎంలు ఆరోపించారు.
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిర్ణయించారు. కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించినట్లు స్టాలిన్ ఆరోపించారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం ఢిల్లీకి వెళ్లడం లేదని, అయితే ఎటువంటి కారణాన్ని ఆమె వెల్లడించలేదని టీఎంసీ నేత ఒకరు వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్తారా అని అడిగిన ప్రశ్నకు ఆ నేత బదులిస్తూ.. దీనిపై ఏం చెప్పలేమని, రేపు మాత్రమే ఈ అంశంపై క్లారిటీ వస్తుందన్నారు.
ఇండియా కూటమి నేతృత్వంలోని ప్రతిపక్షంలో టీఎంసీ కూడా ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

