Liquor bottle in return gift | వీళ్లు మామూలోళ్లు కాదుగా.. పెళ్లికొచ్చిన బంధువులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా లిక్కర్ బాటిళ్లు..!
Liquor bottle in return gift | పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, పుట్టినరోజులు, సీమంతాలు, గృహప్రవేశాలు లాంటి ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన బంధుమిత్రులకు రిటర్న్ గిఫ్టులు ఇవ్వడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్నది.
చెన్నై: పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, పుట్టినరోజులు, సీమంతాలు, గృహప్రవేశాలు లాంటి ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన బంధుమిత్రులకు రిటర్న్ గిఫ్టులు ఇవ్వడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్నది. అయితే రిటర్న్ గిఫ్టులుగా వస్త్రమో, వస్తువో ఇవ్వడం సాధారణమే. కానీ ఇటీవల పుదుచ్చేరిలో ఓ పెళ్లివారు మాత్రం లిక్కర్ బాటిళ్లను రిటర్న్ గిఫ్టులుగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపర్చారు.
పుదుచ్చేరిలో సాధారణంగా శుభకార్యం జరిగినప్పుడు ఆ కార్యానికి విచ్చేసిన బంధుమిత్రులకు కొబ్బరికాయ, అరటిపండు, తమలపాకులు, కుంకుమతో కూడిన తాంబూలాలు ఇస్తారు. అలాగే ఈ పెళ్లివారు కూడా ఓ బ్యాగులో తాంబూలాలు పెట్టి ఇచ్చారు. అయితే ఆ బ్యాగు తెరిచి చూసుకున్న బంధువుల్లో కొందరు మురిసిపోతే, మరికొందరు షాకయ్యారు. ఎందుకంటే ఆ బ్యాగుల్లో కొబ్బరికాయ, అరటిపండు, తమలపాకులు, కుంకుమతోపాటుగా 180 మిల్లీలీటర్ల లిక్కర్ బాటిల్ కూడా ఉంది.
కాగా, ఈ ఘటన గురించి తెలిసి కొందరు నవ్వుకుంటుండగా, ఇంకొందరు మాత్రం సీరియస్ స్పందిస్తున్నారు. ఘటనపై పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. పెళ్లిలో రిటర్న్ గిఫ్టులుగా లిక్కర్ బాటిళ్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

