Manipur’s Displaced People Protest | ఇళ్లకు తిరిగి వెళ్తామంటూ మణిపూర్‌లో నిర్వాసితుల నిరసన.. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించిన పోలీసులు
Manipur's Displaced People Protest | తమ ఇళ్లకు తిరిగి వెళ్తామంటూ మణిపూర్‌లోని నిర్వాసితులు నిరసన చేపట్టారు. బ్యానర్లు, ఫ్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్స్‌ను పోలీసులు ప్రయోగించారు.
ఇంఫాల్: తమ ఇళ్లకు తిరిగి వెళ్తామంటూ మణిపూర్‌లోని నిర్వాసితులు నిరసన చేపట్టారు. (Manipur’s Displaced People Protest) బ్యానర్లు, ఫ్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్స్‌ను పోలీసులు ప్రయోగించారు. ఇంఫాల్ లోయలో ఆధిపత్యమున్న మైతీ, కొండ ప్రాంతాలకు చెందిన కుకీల మధ్య 2023 మేలో జాతి హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో మోరేలోని ఇళ్ల నుంచి పారిపోయిన నిర్వాసితులు ఇంఫాల్‌లోని అకంపత్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో నివసిస్తున్నారు.
కాగా, ఏడాదికిపైగా కఠోర పరిస్థితుల్లో రిలీఫ్ క్యాంపుల్లో జీవిస్తున్న నిర్వాసితులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని భావిస్తున్నారు. దీని కోసం గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమకు భద్రత కల్పించాలని, తాము పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందేందుకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరోవైపు నిర్వాసితులు ర్యాలీగా సీఎం బంగ్లా వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్స్‌ను ప్రయోగించారు. ఈ సంఘటనలో పది మంది నిర్వాసితులతోపాటు సమీపంలోని స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

